Share News

స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైసీపీకి బుద్ధి చెప్పనున్న ప్రజలు: ఎంపీ సానా సతీష్

ABN , Publish Date - Oct 16 , 2026 | 02:57 PM

స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైసీపీకి ప్రజలు బుద్ధి చెబుతారని టీడీపీ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేక దాడులకు దిగుతున్నారంటూ ఆ పార్టీ నేతలపై ఆయన మండిపడ్డారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైసీపీకి బుద్ధి చెప్పనున్న ప్రజలు: ఎంపీ సానా సతీష్
TDP MP Sana Satish

అమరావతి, అక్టోబర్16: స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైసీపీకి ప్రజలు బుద్ధి చెబుతారని టీడీపీ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేక దాడులకు దిగుతున్నారంటూ ఆ పార్టీ నేతలపై ఆయన మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమైనా ఆ పార్టీ నేతలకు ఇంకా బుద్ధి రాలేదని వైసీపీ నేతలను ఉద్దేశించి అన్నారు. శుక్రవారం రాజధాని అమరావతిలో ఎంపీ సానా సతీష్ మాట్లాడుతూ.. పుంగనూరులో వైసీపీ నేతలు అల్లర్లతో అశాంతి సృష్టిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


టీడీపీ శ్రేణులపై వైసీపీ దాడులను సహించేది లేదని పేర్కొన్నారు. ఈ దాడులకు భయపడం.. కార్యకర్తలకు అండగా నిలబడి వాటిని ప్రతిఘటిస్తామని ఎంపీ సానా సతీష్ బాబు చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. దీంతో ఈ రోజు నుంచి నామినేష్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సందర్భంగా పుంగనూరులో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీ సానా సతీష్‌ స్పందించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ఫిర్యాదులకు కంట్రోల్ రూమ్.. ఫోన్ నంబర్లు ఇవే

ఓటర్ల తొలగింపుపై ప్రచారం అవాస్తవం: తెలంగాణ సీఈవో

For More AP News And Telugu News

Updated Date - Oct 16 , 2026 | 03:09 PM