తాతా మధుపై చర్యలు తీసుకోవాల్సిందే: మంత్రి శ్రీధర్ బాబు
ABN , Publish Date - Sep 07 , 2026 | 02:44 PM
బీజేపీ ఎమ్మెల్యేల ఆందోళనలతో వాయిదా పడిన తెలంగాణ శాసనసభ తిరిగి మొదలైంది. ఈ సందర్భంగా స్పీకర్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. స్పీకర్‌ను బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దుర్భాషలాడారని మండిపడ్డారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 7: బీజేపీ ఎమ్మెల్యేల ఆందోళనలతో వాయిదా పడిన తెలంగాణ శాసనసభ తిరిగి మొదలైంది. ఈ సందర్భంగా స్పీకర్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. స్పీకర్‌ను బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దుర్భాషలాడారని మండిపడ్డారు. తాతా మధు వ్యాఖ్యలపై అందరం మనస్తాపం చెందామని.. ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందే అని తెలిపారు. స్పీకర్ వ్యవస్థ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత బీజేపీకి లేదా అని ప్రశ్నించారు. స్పీకర్ చైర్‌పై అనుచిత వ్యాఖ్యలు సరికాదని.. స్పీకర్‌ను దూషించడం దుర్మార్గమని మండిపడ్డారు. స్పీకర్‌ను అవమానించడంపై బీజేపీ వైఖరి చెప్పాలని.. ఆయనకు జరిగిన అవమానంపై ఆ పార్టీ మాట్లాడాలని డిమాండ్ చేశారు.
సభ్యులు సభా సంప్రదాయాలను కాపాడాలని సూచించారు. ఈ అంశంలో బీజేపీ సహకరించాలన్నారు. బీఆర్‌ఎస్ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మంత్రి శ్రీధర్ బాబు ప్రసంగాన్ని బీజేపీ సభ్యులు అడ్డుకోవడంతో అసెంబ్లీ గందరగోళం నెలకొంది. సభలో బీజేపీ సభ్యులు నినాదాలు చేశారు. బీజేపీ సభ్యులు సభను అడ్డుకోవడం సరికాదని.. ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధమని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
రాంచందర్‌రావు అరెస్ట్.. తోపులాట.. ఉద్రిక్తత
అసెంబ్లీ చరిత్రలో బ్లాక్ డే.. ఇదో దుశ్శాసన పర్వం: సునీతా లక్ష్మారెడ్డి
Read Latest Telangana News And Telugu News