Share News

LP మీటింగ్ కూడా కేసీఆర్ ఫాంహౌస్‌లోనే చేస్తారా: మంత్రి సీతక్క

ABN , Publish Date - Sep 07 , 2026 | 12:35 PM

మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేత బయటకు రారని.. ఎల్పీ మీటింగ్ కూడా ఫౌంహౌస్‌లోనే చేస్తారా అంటూ ప్రశ్నించారు.

LP మీటింగ్ కూడా కేసీఆర్ ఫాంహౌస్‌లోనే చేస్తారా: మంత్రి సీతక్క
Minister Seethakka

హైదరాబాద్, సెప్టెంబర్ 7: మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈరోజు(సోమవారం) మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత బయటకు రారని.. ఎల్పీ మీటింగ్ కూడా ఫౌంహౌస్‌లోనే చేస్తారా అంటూ ప్రశ్నించారు. రాజకీయ రాద్ధాంతం తప్ప బీజేపీ, బీఆర్ఎస్‌లకు సమస్యలు పట్టవా అని నిలదీశారు. చట్టాలు చేసే పవిత్ర దేవాలయం అసెంబ్లీ అని.. సమావేశాలకు రాకుండా బయట నిరసన ఎందుకని బీఆర్‌ఎస్‌పై మండిపడ్డారు. సభ ప్రారంభం కాగానే బీజేపీ నిరసన దేనికంటూ ఫైర్ అయ్యారు. చర్చిస్తామంటే నిరసన వ్యక్తం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్షం తెలంగాణలో లేదన్నారు. ప్రతిపక్షాలకు ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉందా అంటూ దుయ్యబట్టారు.


బీజేపీ, బీఆర్ఎస్‌లు డ్రామా కంపెనీలుగా మారాయని మంత్రి విమర్శించారు. ఒకరు అసెంబ్లీ బయట, మరొకరు అసెంబ్లీ లోపల డ్రామా చేస్తున్నారని అన్నారు. వారికి కేవలం రచ్చ, రాజకీయం, ప్రచారం కావాలన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో నియమాలు పెట్టారని.. నియంతగా వ్యవహారించారని వ్యాఖ్యానించారు. వారు పెట్టిన రూల్స్‌ను వారే తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. రాజకీయ డ్రామాలు బంద్ చేసి అసెంబ్లీకి రావాలని మంత్రి సీతక్క ఆహ్వానించారు.


ఇవి కూడా చదవండి...

22 ఏపై చర్చకు బీజేపీ ఎమ్మెల్యేల పట్టు.. తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం

అసెంబ్లీ వద్దకు సీపీ సజ్జనార్..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 07 , 2026 | 01:16 PM