అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత.. కేటీఆర్, హరీశ్ రావు అరెస్ట్
ABN , Publish Date - Sep 07 , 2026 | 10:05 AM
తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గేటు వద్ద ఆందోళనకు దిగిన మాజీ మంత్రి కేటీఆర్, హరీశ్ రావులను పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 7: తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గేటు వద్ద ఆందోళనకు దిగిన మాజీ మంత్రి కేటీఆర్, హరీశ్ రావులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు(సోమవారం) ఉదయం గన్‌పార్క్ నుంచి ర్యాలీగా అసెంబ్లీ గేటు వద్దకు వచ్చిన బీఆర్‌ఎస్ నేతలు లోపలికి వెళ్లేందుకు యత్నించారు. అయితే వారిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ నేతలు నలుపు టీషర్ట్లు ధరించి, ఫ్లకార్డులతో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో.. ఇరువురికి మధ్య వాగ్వాదం తోపులాటకు దారి తీసింది.
పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై కూర్చుని బీఆర్‌ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పెద్దఎత్తున మోహరించిన పోలీసులు.. మాజీ మంత్రి కేటీఆర్, హరీశ్ రావు సహా పలువురు గులాబీ నేతలను అరెస్ట్ చేశారు. ఆపై వారిని తెలంగాణ భవన్‌కు తరలిస్తున్నారు. బీఆర్‌ఎస్ నేతల నిరసనలతో అసెంబ్లీ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
ఇవి కూడా చదవండి...
రెచ్చిపోయిన దొంగలు.. ఆలయంలో సీసీటీవీ కెమెరా వైర్లు కట్ చేసి మరీ చోరీ
ఎన్నికల ముందు అభయహస్తం.. ఆ తర్వాత భస్మాసుర హస్తం: కేటీఆర్
Read Latest Telangana News And Telugu News