రెచ్చిపోయిన దొంగలు.. ఆలయంలో సీసీటీవీ కెమెరా వైర్లు కట్ చేసి మరీ చోరీ
ABN , Publish Date - Sep 07 , 2026 | 09:36 AM
ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట మండలం ముక్త్యాలలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. గత రాత్రి ఆలయంలోకి చొరబడిన దుండగులు ముందుగా సీసీ కెమెరాల వైర్లు కట్ చేశారు.
ఎన్టీఆర్ జిల్లా, సెప్టెంబర్ 7: జిల్లాలోని జగ్గయ్యపేట మండలం ముక్త్యాలలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. గత రాత్రి ఆలయంలోకి చొరబడిన దుండగులు ముందుగా సీసీ కెమెరాల వైర్లు కట్ చేశారు. ఆపై దొంగతనానికి పాల్పడ్డారు. ఆలయంలో సుమారు 15 గ్రాముల బంగారం, 10 కేజీల వెండిని అపహరించారు. ఈరోజు(సోమవారం) ఉదయం ఆలయానికి చేరుకున్న సిబ్బంది చోరీ జరిగినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీంతో కలిసి ఆధారాలను సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆలయంలో సీసీ టీవీ కెమెరా వైర్లను దుండగులు కట్ చేయడంతో చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ, ఇతర ఆధారాలతో నిందితుల కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. చోరీకి పాల్పడ్డ నిందితులను త్వరగా పట్టుకోవాలని భక్తులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి...
దేశం కోసం పిల్లల్ని కనండి.. 7వ సారి తల్లైన జపాన్ మహిళ పిలుపు
Read Latest AP News And Telugu News