Share News

దేశం కోసం పిల్లల్ని కనండి.. 7వ సారి తల్లైన జపాన్ మహిళ పిలుపు

ABN , Publish Date - Sep 07 , 2026 | 08:30 AM

జపాన్‌లో సంతానోత్పత్తి రేటు అంతకంతకూ పడిపోతుండటం అక్కడి ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో కోటో హషిమోటో అనే జపాన్ మహిళ ఏకంగా 7వ బిడ్డకు జన్మనివ్వడం అక్కడ సంచలనంగా మారింది.

దేశం కోసం పిల్లల్ని కనండి.. 7వ సారి తల్లైన జపాన్ మహిళ పిలుపు
Kotoe Hashimoto

ఇంటర్నెట్ డెస్క్: జపాన్‌లో సంతానోత్పత్తి రేటు అంతకంతకూ పడిపోతుండటం అక్కడి ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో కోటో హషిమోటో అనే జపాన్ మహిళ ఏకంగా 7వ బిడ్డకు జన్మనివ్వడం అక్కడ సంచలనంగా మారింది. దేశం కోసం పిల్లల్ని కనాలని కూడా ఆమె సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చింది. ‘నేను 7వ బిడ్డకు జన్మనిచ్చాను. జపాన్ పౌరుడిగా ప్రయాణం ప్రారంభించిన నా బిడ్డకు మీ అందరి ఆశీస్సులు కావాలి. నా నిర్ణయానికి మద్దతు ఇచ్చి అండగా నిలబడినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మన దేశం కీలక దశకు చేరుకుంది. జపాన్ మహిళలు పిల్లల్ని కనాలి. మనదేశ ఉత్తానపతనాలు మహిళలపైనే ఆధారపడి ఉన్నాయి’ అని పేర్కొంది.


సంతానోత్పత్తి రేటు పెంచేందుకు ప్రభుత్వ చేపడుతున్న చర్యలపై కూడా ఆమె తన అభిప్రాయాలు పంచుకుంది. తోడు కోసం వెతుక్కుంటున్న వారి కోసం కాస్మెటిక్ సర్జీలపై కూడా ప్రభుత్వ నిధులు వెచ్చించాలని సూచించింది. ఇలాంటి చర్యలతో జనాల ఆకర్షణీయత పెరుగుతుందని చెప్పింది. ఫలితంగా పెళ్లిళ్లు చేసుకునే జంటల సంఖ్య పెరిగి సంతానోత్పత్తి రేటు కూడా పెరుగుతుందని వివరించింది. ఇలాంటి వ్యాఖ్యలు కాంట్రవర్సీకి దారి తీసే అవకాశం ఉందని తెలిసినా తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా పంచుకుంటున్నట్టు ఆమె పేర్కొంది.


జపాన్ గణాంకాల ప్రకారం, గతేడాది అక్కడ 6.71 లక్షల మంది జన్మించారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2025లో జననాల సంఖ్యలో 15 వేల మేర కోత పడింది. వార్షిక జననాల సంఖ్య తగ్గడం ఇది వరుసగా 7వ సారి. 1899 తరువాత అత్యంత తక్కువ జననాలు 2025లో నమోదయ్యాయి. ఓ దశ తరువాత జనాభా తగ్గుదలను నిలువరించడం దాదాపుగా అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సంతానోత్పత్తి రేటు పెంచేందుకు అనేక దేశాల ప్రభుత్వాలు మహిళలకు పలు రకాల ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి.


ఈ వార్తలనూ చదవండి:

ఏడాదిన్నర బ్రేక్ తరువాత జిమ్‌కు రకుల్.. వీడియో వైరల్

సొరచేప దాడి.. బాధితుడిని కాపాడుకునేందుకు నీళ్లల్లోకి దూకి..

Updated Date - Sep 07 , 2026 | 08:58 AM