Share News

ఏడాదిన్నర బ్రేక్ తరువాత జిమ్‌కు రకుల్.. వీడియో వైరల్

ABN , Publish Date - Sep 06 , 2026 | 07:12 PM

18 నెలల బ్రెక్ తరువాత రకుల్ జిమ్‌‌కు వెళ్లారు. ఎన్నో ఫిట్‌నెస్ వర్కౌట్లను చేశారు.

ఏడాదిన్నర బ్రేక్ తరువాత జిమ్‌కు రకుల్.. వీడియో వైరల్
Rakul Preet Singh

ఇంటర్నెట్ డెస్క్: సరిగ్గా ఏడాదిన్నర బ్రేక్ తరువాత ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ వర్కౌట్స్ చేసేందుకు జిమ్‌‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఒక ప్రత్యేక వీడియో పోస్ట్ చేసి, అభిమానులతో ఆమె తన అనుభూతులను పంచుకున్నారు. 18 నెలల తరువాత మళ్లీ ఫిటనెస్ రొటీన్ మొదలు పెట్టడం ఎంత ఛాలెంజింగ్‌‌గా ఉంటుందో వీడియోలో రకుల్ వివరించారు.

‘నా కండరాలు రెండో సారి ఈ మూవ్‌మెంట్స్‌ను నేర్చుకుంటున్నాయి. నా శరీరానికి వర్కౌట్స్‌కు సంబంధించిన పాత ట్రిక్స్ నేర్పించడం ఒక కొత్త జాబ్‌లాగా అనిపిస్తోంది’ అని రకుల్ పేర్కొన్నారు.


వర్కౌట్స్ ఇలా..

వీడియోలో రకుల్ రిహాబ్-సేఫ్ మూవ్‌మెంట్స్ చేస్తూ కనిపించారు. తరువాత ఆమె వార్మ్-అప్ స్ట్రెచింగ్స్, యోగాసనాలతో వ్యాయామాన్ని మొదలుపెట్టారు. ఆపై బ్యాలెన్స్ కోసం లంజెస్ ఎక్సర్‌సైజ్ చేశారు. బ్యాండెడ్ స్క్వాట్స్, కెటిల్‌బెల్ స్వింగ్స్ వంటివి చేసి, తన వ్యాయామాన్ని ముగించారు. చివర్లో స్టైర్-క్లైంబర్‌ను ఉపయోగించి మరికొంత సేపు వర్కౌట్లు చేశారు.


ఇవీ చదవండి:

అనుష్క.. తెలుగుకు గుడ్ బై ఇంకా

ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం

Updated Date - Sep 06 , 2026 | 07:36 PM