Share News

ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం

ABN , Publish Date - Sep 06 , 2026 | 02:37 PM

ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయిని పోలీసులు అరెస్టు చేయకపోవడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.

ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం
Folk Dancer Madhuri Rathod

హైదరాబాద్, సెప్టెంబర్ 6 (ఆంధ్రజ్యోతి): ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ (Folk Dancer Madhuri Rathod) ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయిని పోలీసులు అరెస్టు చేయకపోవడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలో అతడిపై ఫిర్యాదు చేసిన మూడు రోజులకే ఆమె ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గత ఆగస్టు 22వ తేదీన నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయిపై కేసు నమోదైన విషయం తెలిసిందే.


తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టును ఈశ్వర్ సాయి ఆశ్రయించాడు. పెళ్లి పేరుతో నమ్మించి తనను మోసం చేశాడంటూ బాధితురాలు మాధురి రాథోడ్ ఆవేదన వ్యక్తం చేశారు. అతడిని పోలీసులు అరెస్టు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆరోపించారు. ఈ కేసు నమోదైన తర్వాత ఈశ్వర్ సాయి పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అనే మొక్కను మొలవనివ్వను: సీఎం రేవంత్‌రెడ్డి

చేయూత సామాజిక భద్రతా పెన్షన్లకు కొత్త మార్గదర్శకాలు

గణేశ్ ఉత్సవాలపై సీపీ సజ్జనార్ కీలక ఆదేశాలు.. నెల రోజుల పాటు విజిబుల్ పోలీసింగ్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 06 , 2026 | 03:12 PM