Share News

అసెంబ్లీ చరిత్రలో బ్లాక్ డే.. ఇదో దుశ్శాసన పర్వం: సునీతా లక్ష్మారెడ్డి

ABN , Publish Date - Sep 07 , 2026 | 01:46 PM

అసెంబ్లీ చరిత్రలో ఇది బ్లాక్ డే అని మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. ఇదో దుశ్శాసన పర్వంగా భావిస్తున్నామని చెప్పారు.

అసెంబ్లీ చరిత్రలో బ్లాక్ డే.. ఇదో దుశ్శాసన పర్వం: సునీతా లక్ష్మారెడ్డి
Sunitha Laxma Reddy

హైదరాబాద్, సెప్టెంబర్ 7: తెలంగాణ అసెంబ్లీ వద్ద మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి చీరను పోలీసులు లాగారన్న అంశం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఈ వ్యహారాన్ని బీఆర్‌ఎస్ నేతలు తీవ్రస్థాయిలో తప్పుబడుతున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ చరిత్రలో ఇది బ్లాక్ డే అని అన్నారు. ఇదో దుశ్శాసన పర్వంగా భావిస్తున్నామని చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా మహిళా సభ్యులకు అవమానం జరిగిందని మండిపడ్డారు. గొంతు పట్టడం, జుట్టు లాగడమేంటి అంటూ ఫైర్ అయ్యారు. మహిళలను అవమానించడమే ఇందిరమ్మ రాజ్యమా అని నిలదీశారు. దేశ చరిత్రలోనే ఇలాంటి ఘటన జరిగి ఉండదని సునీతా లక్ష్మారెడ్డి అన్నారు.


మమ్మల్ని అవమానించాలన్నది ఎవరి ఆదేశమో తెలియాలి: సబిత

sabitha.jpg

అసెంబ్లీ దగ్గర ఘటన హేయమని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. తాము అసెంబ్లీకి వెళ్తుంటే అడ్డుకున్నారని.. ప్రభుత్వం విఫలమైందని మాత్రమే ఆరోపించామని అన్నారు. తమను అవమానించాలని ఎవరు ఆదేశించారో తెలియాలన్నారు. సమయానికి కేటీఆర్ రాకపోతే మహిళా నేతలను కిందపడేసి తొక్కేవారని తెలిపారు. అసెంబ్లీకి వచ్చే మహిళా సభ్యులకే రక్షణ లేదని విమర్శించారు. ఘటనకు బాధ్యత వహించి సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి...

LP మీటింగ్ కూడా కేసీఆర్ ఫామ్‌హౌస్‌లోనే చేస్తారా: మంత్రి సీతక్క

రాంచందర్‌రావు అరెస్ట్.. తోపులాట.. ఉద్రిక్తత

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 07 , 2026 | 01:48 PM