అక్క చీర లాగితే తమ్ముడు ఊరుకుంటాడా: హరీశ్ రావు

ABN, Publish Date - Sep 07 , 2026 | 01:07 PM

తెలంగాణ అసెంబ్లీ గేటు వద్ద మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి చీరను పోలీసులు లాగారంటూ బీఆర్‌ఎస్ ఆరోపణలు గుప్పిస్తోంది. ఈ అంశంపై మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఇది బ్లాక్‌ డే అని అన్నారు.

హైదరాబాద్, సెప్టెంబర్ 7: తెలంగాణ అసెంబ్లీ గేటు వద్ద మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి చీరను పోలీసులు లాగారంటూ బీఆర్‌ఎస్ ఆరోపణలు గుప్పిస్తోంది. ఈ అంశంపై మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఇది బ్లాక్‌ డే అని అన్నారు. చీర లాగి సునీతా లక్ష్మారెడ్డిని అవమానించారని మండిపడ్డారు. పోలీసులు సబితా ఇంద్రారెడ్డి గొంతు నులిమారని... జగదీష్‌రెడ్డిని కిందపడేసి తొక్కారని చెప్పారు. తమ టీషర్టులపై అభ్యంతరకర నినాదాలు లేవని వెల్లడించారు. నిరసన టీషర్టులతో రాహుల్, ప్రియాంక పార్లమెంట్‌కు వెళ్లలేదా అని ప్రశ్నించారు. వారికో న్యాయం.. మాకో న్యాయమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షం లేకుండానే చర్చ జరపాలని చూస్తున్నారంటూ హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Updated at - Sep 07 , 2026 | 01:24 PM