Share News

అక్రమంగా అండాల సేకరణ కేసు..ఫెర్టిలిటీ సెంటర్ల నిర్వాహకులను విచారించనున్న మహిళా కమిషన్

ABN , Publish Date - Nov 09 , 2026 | 10:03 AM

మహిళల నుంచి అక్రమంగా అండాలను సేకరించిన వ్యవహారంపై తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఈ నేపథ్యంలోనే ఐదు ఫెర్టిలిటీ సెంటర్లకు నోటీసులను జారీ చేసిన విషయం తెలిసిందే.

అక్రమంగా అండాల సేకరణ కేసు..ఫెర్టిలిటీ సెంటర్ల నిర్వాహకులను విచారించనున్న మహిళా కమిషన్
Telangana Women Commission

హైదరాబాద్, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): మహిళల నుంచి అక్రమంగా అండాలను సేకరించిన వ్యవహారంపై తెలంగాణ మహిళా కమిషన్ (Telangana Women Commission) సీరియస్ అయింది. ఈ నేపథ్యంలోనే ఐదు ఫెర్టిలిటీ సెంటర్లకు నోటీసులను జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందిరా ఐవీఎఫ్, నర్మద ఫెర్టిలిటీ, ఓయాసిస్ ఫెర్టిలిటీ, సద్గురు ART సెంటర్‌కు, పద్మజ ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకులకు కూడా నోటీసులు జారీ చేసింది. ఈరోజు (సోమవారం) ఉదయం 11:30 గంటలకు మహిళా కమిషన్ ఎదుట ఐదు సెంటర్ల ప్రతినిధులు హాజరు కావాలని ఆదేశించింది.


ఈ క్రమంలోనే బుద్ధభవన్‌లోని మహిళా కమిషన్ కార్యాలయానికి నిర్వాహకులు ఇవాళ రానున్నారు. మేనేజింగ్ డైరెక్టర్లు, మెడికల్ సూపరింటెండెంట్లు, సెంటర్ హెడ్‌లు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నేరెళ్ల శారద ఎదుట నిర్వాహకులు లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వనున్నారు. మహిళల నుంచి అండాల సేకరణ విషయంలో నిబంధనల ఉల్లంఘన జరిగిందనే అంశంపై విచారణ జరపనుంది. ఐదు ఫెర్టిలిటీ సెంటర్ల నిర్వాహకుల వివరణలను మహిళా కమిషన్ పరిశీలించనుంది. నిర్వాహకుల వివరణ అనంతరం తదుపరి చర్యలపై మహిళా కమిషన్ స్పష్టమైన నిర్ణయం తీసుకోనుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

మా హయాంలో పేదవారి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి

ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న ఆటో.. ముగ్గురి మృతి

సీఎం రేవంత్‌రెడ్డికి బర్త్ డే విషెస్ తెలిపిన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 09 , 2026 | 10:56 AM