Share News

Telangana Police: ఆ వీడియోలు చూసి, షేర్ చేస్తే కఠిన శిక్షలు.. పోలీసుల హెచ్చరిక

ABN , Publish Date - Jan 05 , 2026 | 12:13 PM

తెలంగాణలో 2025లో చైల్డ్ పోర్నోగ్రఫీ కేసులు గతంతో పోలిస్తే అత్యంత వేగంగా పెరిగాయని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు వెల్లడించారు. చిన్నారుల భద్రతకు ముప్పుగా మారుతున్న ఈ నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం, పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించనున్నట్లు స్పష్టం చేశారు.

Telangana Police: ఆ వీడియోలు చూసి, షేర్ చేస్తే కఠిన శిక్షలు.. పోలీసుల హెచ్చరిక
Telangana Police

హైదరాబాద్, 5 జనవరి 2026: తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ఇప్పటికే చైల్డ్ పోర్న్ వ్యవహారాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. చిన్నారుల భద్రతకు ముప్పుగా మారుతున్న ఈ నేరాలపై ఎలాంటి సడలింపులు ఉండవని హెచ్చరించింది. చైల్డ్ పోర్న్ వీడియోలను చూడటం, సోషల్ మీడియా లేదా ఇతర డిజిటల్ మాధ్యమాల ద్వారా షేర్ చేయడం, ఇతరులకు పంపించడం వంటి నేరాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. కానీ తెలంగాణలో చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన కేసులు 2025లో తీవ్రస్థాయిలో పెరిగాయి. చైల్డ్ పోర్న్ వీడియోలను చూసిన, షేర్ చేసిన నిందితుల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే పదిరెట్లు పెరిగిందని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు వెల్లడించారు. ఈ పెరుగుదల రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది.


భారీగా కేసులు..

ఈ గణాంకాలు చూస్తే, 2025లో చైల్డ్ పోర్న్‌కు సంబంధించిన నేరాలు ఎంత తీవ్రంగా పెరిగాయో స్పష్టంగా అర్థమవుతోంది. 2025లో పదిరెట్లు నిందితుల సంఖ్య పెరిగిందని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు వెల్లడించారు. 2025లో చైల్డ్ పోర్నోగ్రఫీ చూసి షేర్ చేసిన వారిపై భారీగా కేసులు నమోదు చేసినట్లు వివరించారు. ఒక్క ఏడాదిలోనే 869 కేసులు నమోదు చేశామని తెలిపారు. వీరిలో 423 మందిని అరెస్ట్ చేశామని చెప్పుకొచ్చారు. 2024లో 37 మందిని అరెస్ట్ చేశామని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు పేర్కొన్నారు. నిందితుల సంఖ్యలో నమోదైన ఈ భారీ పెరుగుదల అధికారులను కూడా ఆందోళనకు గురి చేస్తోంది. కఠిన హెచ్చరికలు ఉన్నా కూడా చైల్డ్ పోర్న్ వీడియోలను చూసిన, షేర్ చేసిన వారి సంఖ్య భారీగా పెరిగినట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు వెల్లడించారు. ఇకమీదట ఈ కేసులపై ఊపేక్షించబోమని తీవ్రంగా హెచ్చరించారు.


హెచ్చరికలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సైబర్ సెక్యూరిటీ విభాగం కలిసి సోషల్ మీడియా వేదికగా ప్రజలకు కీలక సూచనలు జారీ చేశాయి. చైల్డ్ పోర్న్ వీడియోలను ఎట్టి పరిస్థితుల్లోనూ చూడవద్దని వాటిని షేర్ చేయడం నేరమని అలా చేస్తే కఠిన శిక్షలు తప్పవని స్పష్టం చేశాయి.

దర్యాప్తు..

ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ నిందితులను గుర్తించి అరెస్టు చేస్తున్నామని తెలిపారు. డిజిటల్ ట్రాకింగ్, సోషల్ మీడియా మానిటరింగ్ ద్వారా నేరగాళ్లపై నిఘా పెంచినట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

నేడు అసెంబ్లీలో విద్య, ఆర్థిక, పారిశ్రామిక రంగాలపై కీలక చర్చలు

అందెశ్రీ కుటుంబానికి ప్రభుత్వం అండ.. అసెంబ్లీలో ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టిన భట్టి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 05 , 2026 | 01:20 PM