Share News

Telangana Assembly: నేడు అసెంబ్లీలో విద్య, ఆర్థిక, పారిశ్రామిక రంగాలపై కీలక చర్చలు

ABN , Publish Date - Jan 05 , 2026 | 08:13 AM

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. సాధారణంగా, అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం నిమిత్తం ప్రశ్నోత్తరాల సెషన్ జరుగుతుంది.

Telangana Assembly: నేడు అసెంబ్లీలో విద్య, ఆర్థిక, పారిశ్రామిక రంగాలపై కీలక చర్చలు
Telangana Assembly

హైదరాబాద్, 5 జనవరి (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ (Telangana Assembly) సమావేశాలు నాలుగో రోజు ఇవాళ(సోమవారం) ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ప్రశ్నోత్తరాల సెషన్‌తో అసెంబ్లీ ప్రారంభం కానుంది. ఈ రోజు శాసనసభలో పలు కీలక గెజిట్ నోటిఫికేషన్లను రాష్ట్ర ప్రభుత్వం సభ్యుల ముందు ప్రవేశపెట్టనుంది. తెలంగాణ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్‌కి సంబంధించిన పెండింగ్, వార్షిక నివేదికలను కూడా ప్రభుత్వం శాసనసభకు అందించనుంది. వీటిని సభలో పరిశీలించనున్నారు. ఈ రోజు రెండు ముఖ్యమైన బిల్లులపై చర్చ జరగనుంది.


సభలో ముఖ్యమైన చర్చలు, బిల్లుల ఆమోదం, నూతన నిర్ణయాలపై చర్చించనున్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు, జీఎస్టీ సవరణ బిల్లు, హిల్ట్ పాలసీ తదితర అంశాలపై మాట్లాడనున్నారు. ఈ బిల్లులను శాసనసభలో ఆమోదించి అమలు చేసే అవకాశం ఉంది.


తెలంగాణ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్..

తెలంగాణ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్‌కి సంబంధించి పెండింగ్, వార్షిక నివేదికలను ఈ రోజు శాసనసభ ముందు రాష్ట్ర ప్రభుత్వం ఉంచే అవకాశం ఉంది. ఈ నివేదికలో భాగంగా భద్రతా, వాణిజ్య, నిర్వహణ సంబంధిత అంశాలపై చర్చించనున్నారు.


తెలంగాణ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు

తెలంగాణ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లుపై చర్చించనున్నారు. రాష్ట్రంలోని విద్యావ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టనుంది. తెలంగాణలోని విశ్వవిద్యాలయాలకు సంబంధించి ఆర్థిక సహాయం, వనరులపై చర్చించనున్నారు.


హైదరాబాద్ ఇండస్ట్రీయల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీపై లఘు చర్చ

అసెంబ్లీ సమావేశాల్లో హైదరాబాద్ ఇండస్ట్రీయల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ (HILT) పాలసీ గురించి లఘు చర్చ జరుగనుంది. ఈ పాలసీలో భాగంగా హైదరాబాద్ నగరంలోని పారిశ్రామిక భూములపై చర్చించనున్నారు.


అసెంబ్లీ సమావేశాలకు దూరంగా బీఆర్ఎస్..

మరోవైపు అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ నేతలు నిర్ణయించారు. శాసనసభ, శాసనమండలి సమావేశాలకు ఈరోజు దూరంగా ఉండాలని భావించారు. ఉభయ సభలకు హాజరుకావొద్దని నిర్ణయం తీసుకున్నారు. సభలో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వటంలేదని నిరసనగా బీఆర్ఎస్ బాయ్‌కాట్ చేసింది. ఈ క్రమంలోనే తెలంగాణ భవన్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లనున్నారు. పాలమూరు, రంగారెడ్డి, నదీ జలాలపై పోరాటానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు.


శాసనమండలికి కవిత

శాసనమండలికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇవాళ(సోమవారం) రానున్నారు. మండలిలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఇప్పటికే శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిని కలిసి కవిత విజ్ఞప్తి చేశారు. ఈరోజు శాసనమండలిలో కవిత మాట్లాడే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే తన రాజీనామాను ఆమోదించాలని శాసనమండలిలో కోరనున్నారు. గత సెప్టెంబర్ 3వ తేదీన బీఆర్ఎస్ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవికి ఆమె రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికీ కవిత రాజీనామాకు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆమోదం తెలపలేదు.


ఈ వార్తలు కూడా చదవండి...

అసెంబ్లీలో తేల్చుకుందాం రండి.. బీఆర్ఎస్ నేతలకు సీఎం సవాల్

అందెశ్రీ కుటుంబానికి ప్రభుత్వం అండ.. అసెంబ్లీలో ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టిన భట్టి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 05 , 2026 | 08:39 AM