Share News

నిరుద్యోగులకు అలర్ట్.. పోలీస్ ఉద్యోగాల భర్తీపై బిగ్ అప్‌డేట్

ABN , Publish Date - Jul 05 , 2026 | 10:15 AM

తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త. తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు త్వరలో భారీ స్థాయిలో పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.

నిరుద్యోగులకు అలర్ట్.. పోలీస్ ఉద్యోగాల భర్తీపై బిగ్ అప్‌డేట్
Telangana Police Recruitment

హైదరాబాద్, జులై 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల (Telangana Police Recruitment) కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త. తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు త్వరలో భారీ స్థాయిలో పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 7,437 పోస్టులకు సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను సిద్ధం చేసినట్లు బోర్డు చైర్మన్ వెల్లడించారు.


ఈ నియామకాల్లో 3,697 సివిల్ కానిస్టేబుల్ పోస్టులు, 1,052 ఆర్మ్‌డ్ రిజర్వ్ (AR) కానిస్టేబుల్ పోస్టులు, 1,380 స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయనున్నారు. అలాగే 148 సివిల్ సబ్‌ ఇన్‌స్పెక్టర్ (SI) పోస్టులకు కూడా నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా జైల్ వార్డెన్, ఫైర్ డిపార్ట్‌మెంట్ వార్డెన్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు కూడా ఇదే ప్రక్రియలో విడుదలయ్యే అవకాశం ఉందని బోర్డు చైర్మన్ తెలిపారు. దీంతో పోలీస్, జైల్, ఫైర్ సర్వీసుల్లో ఉద్యోగాలను లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా మారనుంది.


ప్రస్తుతం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ సిద్ధంగా ఉండగా, ప్రభుత్వ అనుమతులు పూర్తైన వెంటనే అధికారిక నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ తెలిపారు. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, పరీక్ష తేదీలు, దరఖాస్తు ప్రక్రియ వంటి పూర్తి వివరాలను అధికారిక ప్రకటనలో వెల్లడించనున్నారు. పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు ఇప్పటి నుంచే శారీరక దారుఢ్యం, రాత పరీక్ష, కరెంట్ అఫైర్స్ వంటి అంశాలపై ప్రణాళికాబద్ధంగా సిద్ధమైతే పోటీలో మెరుగైన అవకాశాలు సాధించవచ్చని అధికారులు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ప్రజల ప్రేమే నా బలం.. 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై సీఎం రేవంత్‌రెడ్డి

వరంగల్ భద్రకాళీ ఆలయం వద్ద ఉద్రిక్తత.. బీజేపీ నేతలను అడ్డుకున్న పోలీసులు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jul 05 , 2026 | 10:26 AM