మహారాష్ట్ర ముంపు, పర్యావరణ ఆందోళనలకు ఆచరణాత్మక పరిష్కారాలు చూపాలి: మంత్రి ఉత్తమ్
ABN , Publish Date - Oct 31 , 2026 | 09:00 PM
మహారాష్ట్ర ముంపు, పర్యావరణ ఆందోళనలకు ఆచరణాత్మక పరిష్కారాలు చూపాలని అధికారులను తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. సాగునీటి లక్ష్యాలకు భంగం కలగకుండా పర్యావరణ ప్రభావాన్ని తగ్గించాలని సూచించారు.
హైదరాబాద్, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): మహారాష్ట్ర ముంపు, పర్యావరణ ఆందోళనలకు ఆచరణాత్మక పరిష్కారాలు చూపాలని అధికారులను తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Telangana Minister Uttam Kumar Reddy) ఆదేశించారు. సాగునీటి లక్ష్యాలకు భంగం కలగకుండా పర్యావరణ ప్రభావాన్ని తగ్గించాలని సూచించారు. ఈరోజు (శనివారం) రాష్ట్ర సచివాలయంలో తుమ్మిడిహెట్టి బ్యారేజీ అలైన్‌మెంట్లు, సాంకేతిక అంశాలపై మంత్రి ఉత్తమ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. అటవీ భూములు, జనావాసాలు, పర్యావరణ సున్నిత ప్రాంతాలను గుర్తించాలని సూచించారు.
5.85 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యం..
మహారాష్ట్ర అభ్యంతరాలను పరిష్కరించేలా ఇంజినీరింగ్ మార్పులను పరిశీలించాలని మంత్రి ఉత్తమ్ మార్గనిర్దేశం చేశారు. తుమ్మిడిహెట్టి ఎఫ్‌ఆర్‌ఎల్‌ను 148 మీటర్ల నుంచి 152 మీటర్లకు పెంచాలని తెలంగాణ ప్రతిపాదనలు చేసిందని వెల్లడించారు. 152 మీటర్ల నీటిమట్టంతో 5.697 టీఎంసీలకు నిల్వ సామర్థ్యం పెరగనుందని తెలిపారు. 77 టీఎంసీల నీటిని మళ్లించేలా బ్యారేజ్ రూపకల్పన చేసినట్లు చెప్పుకొచ్చారు. ఏడు జిల్లాల్లో 5.85 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యమని ఉద్ఘాటించారు. ముంపు, పునరావాస సమస్యలకు సాంకేతిక పరిష్కారాలపై దృష్టిసారించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైస్పీడ్ రైళ్ల మార్గాల పనులను వేగవంతం చేయండి.. కేంద్రానికి సీఎం రేవంత్ విన్నపం
ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించం: మంత్రి పొంగులేటి
ఆదిలాబాద్‌కు ఏముఖం పెట్టుకుని వస్తారు.. కేటీఆర్‌పై కవిత ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News