Share News

తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరిగేలా గ్లోబల్ సమ్మిట్: మంత్రి శ్రీధర్ బాబు

ABN , Publish Date - Nov 24 , 2026 | 03:00 PM

తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరిగేలా గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నామని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. మంగళవారం భారత్ ఫ్యూచర్ సిటీలో మంత్రి పర్యటించారు.

తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరిగేలా గ్లోబల్ సమ్మిట్:  మంత్రి శ్రీధర్ బాబు
Telangana Minister Sridhar Babu

హైదరాబాద్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరిగేలా గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నామని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు (Telangana Minister Sridhar Babu) వ్యాఖ్యానించారు. ఈరోజు (మంగళవారం) భారత్ ఫ్యూచర్ సిటీలో మంత్రి పర్యటించారు. ఈ సమ్మిట్ ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.


ప్రధాన వేదిక, ఎక్స్ పో జోన్, సెక్యూరిటీ, ట్రాఫిక్ నియంత్రణ, కనెక్టివిటీ, అతిథులకు వసతులు, తదితర అంశాలపై ప్రత్యేకంగా మంత్రి సమీక్షించారు. సదస్సు గడువు సమీపిస్తున్నందున పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్దేశిత గడువులోపు ఆయా పనులను పూర్తి చేసేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలని సూచించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

కేసీఆర్ హయాంలోనే పల్నాడు వాటర్‌ గ్రిడ్‌‌కు బీజం పడింది.. సీఎం రేవంత్ ధ్వజం

పార్టీ ఫిరాయింపుల చట్టంపై కేంద్రం, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు

నీటి వాటాలపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య కుదరని ఏకాభిప్రాయం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 24 , 2026 | 03:56 PM