Share News

పిల్లల దత్తత విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త: మంత్రి సీతక్క

ABN , Publish Date - Apr 30 , 2026 | 03:18 PM

పిల్లల దత్తత విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా వ్యవహరించాలని తెలంగాణ రాష్ట్ర శిశు, సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. దత్తత కావాలనుకున్న వారు ఐసీడీసీని సంప్రదించాలని సూచించారు.

పిల్లల దత్తత విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త: మంత్రి సీతక్క
Telangana Minister Seethakka

హైదరాబాద్‌, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): పిల్లల దత్తత విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా వ్యవహరించాలని తెలంగాణ రాష్ట్ర శిశు, సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Telangana Minister Seethakka) పేర్కొన్నారు. దత్తత కావాలనుకున్న వారు ఐసీడీసీని సంప్రదించాలని సూచించారు. ఈరోజు (శుక్రవారం) కాచిగూడ బస్ టెర్మినల్‌లో అమ్మఒడి తల్లిపాల ఫీడింగ్ కేంద్రాన్ని, కాచిగూడ రైల్వే‌స్టేషన్‌లో పిల్లల దత్తత కేంద్రాన్ని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌తో కలిసి మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడారు.


సమ్మక్క - సారలమ్మ జాతరలో పిల్లల తల్లులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో, జన సమూహ ప్రాంతాల్లో, బస్సు టెర్మినల్, రైల్వేస్టేషన్, బస్టాండ్‌లలో తల్లిపాల ఫీడింగ్ కేంద్రాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక, శిశు, సంక్షేమ శాఖ అధికారులు, రైల్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

న్యాయవ్యవస్థపై గౌరవం.. కానీ సత్యాగ్రహం తప్పదు: కేజ్రీవాల్

హైకోర్టును ఆశ్రయించిన నటి అషురెడ్డి.. ఎందుకంటే..

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Apr 30 , 2026 | 03:36 PM