మహిళలను సంపద సృష్టించే శక్తిగా తీర్చిదిద్దుతున్నాం: మంత్రి సీతక్క
ABN , Publish Date - May 26 , 2026 | 12:18 PM
మహిళలను సంపద సృష్టించే శక్తిగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. మహిళల ఆదాయం పెరిగితే కుటుంబం బలపడుతుందని పేర్కొన్నారు.
హైదరాబాద్, మే 26 (ఆంధ్రజ్యోతి): మహిళలను సంపద సృష్టించే శక్తిగా తీర్చిదిద్దుతున్నామని తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Telangana Minister Seethakka) వ్యాఖ్యానించారు. మహిళల ఆదాయం పెరిగితే కుటుంబం బలపడుతుందని పేర్కొన్నారు. ఈరోజు (మంగళవారం) బంజారాహిల్స్‌లో సఖి నివాస్ వర్కింగ్ ఉమెన్ హాస్టల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరై మాట్లాడారు. జూన్ 5వ తేదీన మహిళలకు సీఎం రేవంత్‌రెడ్డి ఆర్టీసీ బస్సులు అందజేస్తారని తెలిపారు. మహిళా సంఘాల సోలార్ ప్లాంట్లను రేపు (బుధవారం) డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క మధిరలో ప్రారంభిస్తారని పేర్కొన్నారు.
మహిళల ఉన్నతే తెలంగాణ ప్రగతి అని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. వర్కింగ్ ఉమెన్స్ భద్రత తమ ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. గ్రామీణ మహిళలకు హైదరాబాద్‌లో సురక్షిత వసతి కల్పిస్తున్నామని చెప్పుకొచ్చారు. సఖి నివాస్‌లో 150 మంది మహిళలకు వసతి సౌకర్యం కల్పిస్తున్నామని వివరించారు. చిన్నపిల్లలతో వచ్చే తల్లులకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. మహిళల భద్రత, వారి గౌరవానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణ పరిమితి పెంచుతున్నట్లు మంత్రి సీతక్క పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
కేంద్రం సహకరించకున్నా ధాన్యం కొనుగోలు చేస్తున్నాం: సీఎం రేవంత్‌రెడ్డి
కేంద్ర ప్రభుత్వ దుర్మార్గమైన విధానాలతో రైతాంగం కష్టాల్లో ఉన్నారు: మంత్రి తుమ్మల
Read Latest Telangana News And AP News And International News And Telugu News