పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్లను అందజేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
ABN , Publish Date - Feb 18 , 2026 | 07:12 PM
హైదరాబాద్ జిల్లాలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా కల్పించారు. L1 కింద 4,800 మందికి రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి నిధులు ఇచ్చామని స్పష్టం చేశారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ జిల్లాలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ (Telangana Minister Ponnam Prabhakar) భరోసా కల్పించారు. సచివాలయంలో హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ ఇవాళ(బుధవారం) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. L1 కింద 4,800 మందికి రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి నిధులు ఇచ్చామని స్పష్టం చేశారు.
L2 కింద హైదరాబాద్ నుంచి 4.22 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. భాగ్యనగరంలో స్థలాల సేకరణతో G+5 నుంచి G+10 వరకు ఇళ్ల నిర్మాణ ప్లాన్ చేస్తున్నామన్నారు. ఈ క్రమంలో పెండింగ్ డబుల్ బెడ్ రూం ఇళ్ల పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే, మురికివాడల్లో ఇందిరమ్మ మోడల్ కాలనీల ఏర్పాటుపై మంత్రులు సమీక్షించారు. ఇందిరమ్మ ఇళ్లను పారదర్శకంగా అందజేస్తామని.. నిజమైన లబ్ధిదారుల ఎంపికే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
డేటా సెంటర్లకు రాయితీలపై అధ్యయనం చేయాలి.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
కాంగ్రెస్ దాడులకు దిగింది: ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు
Read Latest Telangana News And AP News And Telugu News