Share News

ధరణి దోపిడీపై ఉక్కుపాదం: మంత్రి పొంగులేటి

ABN , Publish Date - Feb 18 , 2026 | 05:05 PM

ధరణి దోపిడీపై ఉక్కుపాదం మోపుతామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ధరణి వ్యవహారంలో తీగ లాగితే డొంక కదిలినట్లు అక్రమాలు బయటపడుతున్నాయని చెప్పుకొచ్చారు.

ధరణి దోపిడీపై ఉక్కుపాదం: మంత్రి పొంగులేటి
Telangana Minister Ponguleti Srinivasa Reddy

హైదరాబాద్, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): ధరణి దోపిడీపై ఉక్కుపాదం మోపుతామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Telangana Minister Ponguleti Srinivasa Reddy) హెచ్చరించారు. సచివాలయంలో ధరణిపై ఉన్నత స్థాయి కమిటీతో మంత్రి పొంగులేటి ఇవాళ(బుధవారం) సమీక్షా సమావేశం నిర్వహించారు. ధరణి వ్యవహారంలో తీగ లాగితే డొంక కదిలినట్లు అక్రమాలు బయటపడుతున్నాయని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ విచారణలో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల భారీ దోపిడీ బయటపడిందన్నారు. ధరణి పోర్టల్‌లో లోపాలు సాంకేతికం కాదని.. వ్యవస్థాగతంగా సృష్టించినవేనని తెలిపారు.


అనుమానాస్పద భూముల డేటా, లాగిన్ వివరాలు డిలీట్ చేసినట్లు గుర్తించామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. వెంటనే ధరణి పోర్టల్‌పై కోడ్ ఆడిట్ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విదేశీ సంస్థ టెర్రాసిస్ నిర్వహణ వల్లే సమస్యలంటూ ఆరోపణలు వచ్చాయని చెప్పుకొచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో ధరణి అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రతి పైసా వసూల్ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

డేటా సెంటర్లకు రాయితీలపై అధ్యయనం చేయాలి.. అధికారులకు సీఎం దిశానిర్దేశం

కాంగ్రెస్ దాడులకు దిగింది: ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 18 , 2026 | 05:08 PM