Share News

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

ABN , Publish Date - Oct 24 , 2026 | 04:39 PM

జర్నలిస్టులకు ఇళ్లస్థలాలపై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఈరోజు (శనివారం) కీలక ప్రకటన చేశారు. జర్నలిస్టుల సొంతింటి కల సాకారం చేస్తామని.. వారికి ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు.

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Telangana Minister Ponguleti Srinivas Reddy

హైదరాబాద్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): జర్నలిస్టులకు ఇళ్లస్థలాలపై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Telangana Minister Ponguleti Srinivas Reddy) ఈరోజు (శనివారం) కీలక ప్రకటన చేశారు. జర్నలిస్టుల సొంతింటి కల సాకారం చేస్తామని.. వారికి ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. న్యాయపరమైన చిక్కులు లేని విధంగా స్థలాలను కేటాయిస్తామని స్పష్టం చేశారు. నివాసయోగ్యమైన ప్రాంతంలో ఇళ్లస్థలాలు అందిస్తామని చెప్పుకొచ్చారు. జర్నలిస్టులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఇళ్లస్థలాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని పేర్కొన్నారు.


సీఎం రేవంత్‌రెడ్డితో పలుమార్లు ఈ విషయంపై చర్చించామని మంత్రి పొంగులేటి తెలిపారు. జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ అంశంపై సమీక్షిస్తున్నామని అన్నారు. గతంలో న్యాయపరమైన చిక్కులతో స్థలాల ప్రక్రియ నిలిచిపోయిందని ప్రస్తావించారు. 2008లో జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి భూముల కేటాయింపునకు ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌తో ఇళ్ల స్థలాల ప్రక్రియ నిలిచిపోయిందని వెల్లడించారు. 2022లో న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయని చెప్పారు. 2024 సెప్టెంబర్ 8వ తేదీన జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి భూమి అప్పగించామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పోలీస్ శాఖలో అనేక సంస్కరణలు తెచ్చాం: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ అభివృద్ధిలో ఎస్పీఎఫ్ పాత్ర కీలకం: భట్టి విక్రమార్క

క్యూర్ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే లక్ష్యం: మంత్రి పొంగులేటి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 24 , 2026 | 05:05 PM