Share News

ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌కు భారీ స్పందన

ABN , Publish Date - Aug 08 , 2026 | 06:29 PM

ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌కు లబ్ధిదారుల నుంచి భారీ స్పందన వచ్చింది. 7,340 ఇళ్లకు 35,125 దరఖాస్తులు వచ్చాయి.

ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌కు భారీ స్పందన
Indiramma Houses

హైదరాబాద్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌కు (Indiramma Houses) లబ్ధిదారుల నుంచి భారీ స్పందన వచ్చింది. 7,340 ఇళ్లకు 35,125 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులకు ఆగస్టు 10వ తేదీ వరకు మాత్రమే సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ గడువు విధించింది. ఆగస్టు 20వ తేదీ తర్వాత లాటరీ ద్వారా ఇళ్లను కేటాయించనుంది. మార్కెట్‌లో రూ.30 నుంచి రూ.58 లక్షల విలువైన ఫ్లాట్లను కేవలం రూ.6 లక్షలకే కాంగ్రెస్ సర్కార్ అందజేయనుంది.


లబ్ధిదారులకు ఇళ్లు రాకపోతే రూ.10 వేల డిపాజిట్‌ను పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం తిరిగి చెల్లించనుంది. కుల, ఆదాయ సర్టిఫికెట్లు లేకుండానే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఈ ఏడాదిలోగా టవర్స్ నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయనుంది. ఇప్పటికే 16 నియోజకవర్గాల్లో 7,340 ఫ్లాట్ల నిర్మాణం చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.


వార్తలు కూడా చదవండి...

సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో ఆ పాఠశాలకు నూతన సొబగులు

జీసీసీలకు తెలంగాణే బెస్ట్ డెస్టినేషన్: మంత్రి శ్రీధర్ బాబు

క్షుద్ర పూజల విషయంలో హరీశ్‌రావు వివరణ ఇవ్వాలి: మహేశ్ గౌడ్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 08 , 2026 | 06:53 PM