Share News

ఆరోగ్యశాఖలో మరో భారీ రిక్రూట్‌మెంట్‌.. 1,931 పోస్టులకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్

ABN , Publish Date - Sep 01 , 2026 | 06:05 PM

తెలంగాణ ఆరోగ్యశాఖలో మరో భారీ నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. 1,931 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ను అధికారులు విడుదల చేశారు.

ఆరోగ్యశాఖలో మరో భారీ రిక్రూట్‌మెంట్‌.. 1,931 పోస్టులకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్
Telangana Health Department Recruitment

హైదరాబాద్, సెప్టెంబర్ 1 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఆరోగ్యశాఖలో మరో భారీ నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. 1,931 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (MPHA) పోస్టులకు సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ను అధికారులు విడుదల చేశారు. అభ్యర్థులను 1:1.25 నిష్పత్తిలో షార్ట్‌లిస్ట్ చేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఎంపిక చేశారు.


షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు సెప్టెంబర్ 16వ తేదీ నుంచి 26వ తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. హైదరాబాద్ వెంగల్‌రావునగర్‌లోని IIFHWలో ఈ ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. నిర్ణీత తేదీల్లో వెరిఫికేషన్‌కు హాజరు కాలేని అభ్యర్థులకు సెప్టెంబర్ 28వ తేదీన మరో అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు.


సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యే అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల జిరాక్స్ ప్రతులను తీసుకురావాల్సి ఉంటుంది. విద్యార్హతలు, ఇతర అవసరమైన ధ్రువపత్రాలను అధికారులు పరిశీలించనున్నారు. వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన అనంతరం ఫైనల్ మెరిట్ లిస్ట్‌తో పాటు సెలక్షన్ లిస్ట్‌ను విడుదల చేయనున్నారు.


గత రెండున్నరేళ్లలో తెలంగాణ ఆరోగ్యశాఖలో 15 వేలకు పైగా పోస్టులను భర్తీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగంగా కొనసాగిస్తోంది. ప్రస్తుతం మరో 2 వేల పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా కొనసాగుతోంది.


1,931 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌లో చోటు దక్కిన అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలు, అవసరమైన ధ్రువపత్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులు సూచిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో తొలిసారిగా కవచ్ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తున్నాం: కిషన్‌రెడ్డి

ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లోనే మేము ఓట్లు అడుగుతాం: మంత్రి పొంగులేటి

‘తెలంగాణ - జర్మనీ’ లాజిస్టిక్ కారిడార్ ఏర్పాటుకు సహకరించండి: మంత్రి శ్రీధర్‌బాబు

Read Latest Telangana News And AP NewsAnd National News

And Telugu News

Updated Date - Sep 01 , 2026 | 06:17 PM