హైదరాబాద్ కేబీఆర్ చుట్టూ స్టీల్ ఫ్లైఓవర్లు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
ABN , Publish Date - Oct 06 , 2026 | 05:31 PM
హైదరాబాద్ కేబీఆర్ చుట్టూరా నిర్మించనున్న స్టీల్ ఫ్లైఓవర్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూబ్లీహిల్స్– ముఫ్ఫకం జా ఇంజినీరింగ్ కాలేజ్ ఫ్లైఓవర్ పనులను మేఘా ఇంజినీరింగ్‌కు అప్పగించింది.
హైదరాబాద్, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ కేబీఆర్ చుట్టూరా నిర్మించనున్న స్టీల్ ఫ్లైఓవర్లపై తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) కీలక నిర్ణయం తీసుకుంది. జూబ్లీహిల్స్– ముఫ్ఫకం జా ఇంజినీరింగ్ కాలేజ్ ఫ్లైఓవర్ పనులను మేఘా ఇంజినీరింగ్‌కు అప్పగించింది. బంజారాహిల్స్, NFCL, TV9 జంక్షన్ పనులపై పాత ఆర్డర్లను రద్దు చేసింది. కేఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్‌కు (KNR Constructions) గతంలో ఇచ్చిన పనుల ఉత్తర్వులను రద్దు చేసింది. ప్యాకేజీ-1లో పనుల పరిధిలో భారీ మార్పులు చేపట్టింది. రూ.580 కోట్ల ప్రాజెక్టు వ్యయాన్ని రూ.365.85 కోట్లకు సవరించింది.
ప్యాకేజీ-2 పనుల పరిధి, ప్రాంతంలోనూ తెలంగాణ సర్కార్ మార్పులు చేసింది. రూ.510 కోట్లకు బదులుగా రూ.349.31 కోట్లకు సవరించింది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి ముఫ్ఫకం జా ఇంజినీరింగ్ కాలేజ్ వరకు కొత్త ఫ్లైఓవర్‌ను డిజైన్ చేసింది. మార్పులు చేసిన ప్రతిపాదనలను EPC కమిటీ-III ముందు పెట్టేందుకు అనుమతి ఇచ్చింది. ఫ్లైఓవర్ల పనులపై జీహెచ్‌ఎంసీ చర్యలకు ప్రభుత్వం ర్యాటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు జీవో ఆర్టీ నంబర్ -927ను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణను అంతర్జాతీయ విద్యా కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యం: సీఎస్ సంజయ్ జాజు
తెలంగాణలో ‘సర్’ పేరుతో 90 లక్షల ఓట్లు తీసేశారు: మహేశ్ గౌడ్
రామప్పను కాపాడేందుకు పెద్దఎత్తున ఉద్యమిస్తాం: కేటీఆర్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News