Share News

హైదరాబాద్‌కు హైస్పీడ్ రైలు కనెక్టివిటీపై తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్

ABN , Publish Date - May 15 , 2026 | 03:01 PM

హైస్పీడ్ రైలు కారిడార్లపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు శుక్రవారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముంబై, చెన్నై, బెంగళూరుకు హైస్పీడ్ రైలు కనెక్టివిటీ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్‌కు హైస్పీడ్  రైలు కనెక్టివిటీపై తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్
High Speed Rail

హైదరాబాద్, మే 15 (ఆంధ్రజ్యోతి): హైస్పీడ్ రైలు కారిడార్లపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు ఈరోజు (శుక్రవారం) సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముంబై, చెన్నై, బెంగళూరుకు హైస్పీడ్ రైలు కనెక్టివిటీ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కేంద్ర రైల్వేశాఖతో కలిసి డీపీఆర్‌లు సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు. తెలంగాణ రైజింగ్ 2047కు హైస్పీడ్ రైల్ ప్రాజెక్టులు కీలకమని చెప్పుకొచ్చారు. పారిశ్రామిక, ఐటీ, పర్యాటక రంగాలకు ఈ ప్రాజెక్ట్‌తో ప్రయోజనకరమని తెలిపారు.


హైదరాబాద్ – పుణె – ముంబై కారిడార్‌లకు సంబంధించిన డీపీఆర్ సిద్ధం చేయాలని మార్గ నిర్దేశం చేశారు. 671 కిలోమీటర్ల మార్గానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. తెలంగాణలో 93 కిలోమీటర్లమేర భూసేకరణ అవసరమని తెలిపారు. హైదరాబాద్ – బెంగళూరు, చెన్నై కారిడార్లకు 123 కిలోమీటర్ల భూసేకరణ కావాలని చెప్పారు. HMDA, GMR, రైల్వేశాఖల సమన్వయంతో ఈ ప్రాజెక్టు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. భూసేకరణ, కనెక్టివిటీ, మౌలిక వసతులపై చర్యలకు సీఎస్ రామకృష్ణరావు ఆదేశాలు జారీ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

రైతులను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోంది: మంత్రి తుమ్మల

వరి, మొక్కజొన్న, జొన్న కొనుగోళ్లలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలం: మహేశ్వర్ రెడ్డి

ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం.. కేటీఆర్ సహా ముగ్గురికి ఏసీబీ కోర్టు సమన్లు

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 15 , 2026 | 04:00 PM