తెలంగాణలో ఈహెచ్ఎస్ ట్రస్ట్ బోర్డు పునర్వ్యవస్థీకరణ.. జీఓ విడుదల
ABN , Publish Date - Jun 17 , 2026 | 07:28 PM
ఉద్యోగుల ఆరోగ్య పథకం ట్రస్ట్ బోర్డును తెలంగాణ ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఈహెచ్ఎస్ అమలుకు కొత్త బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఏర్పాటు చేస్తూ జీఓ నంబర్-40 విడుదల చేసింది.
హైదరాబాద్, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) ట్రస్ట్ బోర్డును తెలంగాణ ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఈహెచ్ఎస్ అమలుకు కొత్త బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఏర్పాటు చేస్తూ జీఓ నంబర్-40 విడుదల చేసింది. చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఈహెచ్ఎస్ ట్రస్ట్ బోర్డు కొనసాగనుంది. ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల ప్రతినిధులకు బోర్డులో ప్రభుత్వం స్థానం కల్పించింది.
ఉద్యోగులకు హెల్త్ కార్డుల జారీ విధానంపై మార్గదర్శకాలని ఈ బోర్డు రూపొందించనుంది. త్వరలో సమావేశమై ఈహెచ్ఎస్ అమలు మార్గదర్శకాలను ట్రస్ట్ బోర్డు ఖరారు చేయనుంది. ఆరోగ్య, ఆర్థిక, విద్య, హోం తదితర శాఖల ఉన్నతాధికారులు సభ్యులుగా నియమించింది. టీఎన్‌జీఓ, టీజీఓ, పీఆర్‌టీయూ, టీఎస్‌యూటీఎఫ్ సహా ఉద్యోగ సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించింది. పెన్షనర్ల సంఘాల ప్రతినిధులకు కూడా ట్రస్ట్ బోర్డులో చోటు దక్కింది.
ఈ వార్తలు కూడా చదవండి...
బోనస్ ఇచ్చే 7 రకాల సన్న వడ్లు అందుబాటులో ఉంచాలి: సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం..
Read Latest Telangana News And AP News And National News
And Telugu News