Share News

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు ప్రత్యేక కమిటీ

ABN , Publish Date - May 15 , 2026 | 08:57 PM

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు ప్రత్యేక కమిటీని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు జీఓ నంబర్ - 679 జీవో జారీ చేసింది.

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు ప్రత్యేక కమిటీ
Telangana Government

హైదరాబాద్, మే 15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు ప్రత్యేక కమిటీని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు జీఓ నంబర్ - 679 జీవో జారీ చేసింది. ఉద్యమకారుల సేవలు, త్యాగాలకు అధికారిక గుర్తింపు ఇచ్చింది. అమరుల కుటుంబాలు, బాధితులకు గౌరవం లక్ష్యం ఇస్తామని తెలిపింది. జైలు జీవితం గడిపిన ఉద్యమకారుల గుర్తింపుపై దృష్టి సారించింది. కమిటీ చైర్మన్‌గా డాక్టర్ కే. కేశవరావుని నియమించింది. కమిటీ సభ్యులుగా పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్సీ కోదండరాం తదితరులు ఉన్నారు. అర్హుల జాబితాని కమిటీ సిద్ధం చేయనుంది. గౌరవం, సౌకర్యాలపై ప్రభుత్వానికి సిఫార్సులు చేసింది. త్వరగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. అన్నిశాఖలు కమిటీకి సహకరించాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది.


ఈ వార్తలు కూడా చదవండి...

రైతులను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోంది: మంత్రి తుమ్మల

వరి, మొక్కజొన్న, జొన్న కొనుగోళ్లలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలం: మహేశ్వర్ రెడ్డి

ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం.. కేటీఆర్ సహా ముగ్గురికి ఏసీబీ కోర్టు సమన్లు

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 15 , 2026 | 08:59 PM