మెడికల్ టూరిజంపై తెలంగాణ సర్కార్ ఫోకస్
ABN , Publish Date - Jun 07 , 2026 | 09:57 PM
మెడికల్ టూరిజంపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజానికి కమిటీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు టిమ్స్ సనత్‌నగర్‌లో ప్రత్యేక మెడికల్ టూరిజం బ్లాక్ ప్రతిపాదించింది.
హైదరాబాద్, జూన్7 (ఆంధ్రజ్యోతి): మెడికల్ టూరిజంపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజానికి కమిటీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు టిమ్స్ సనత్‌నగర్‌లో ప్రత్యేక మెడికల్ టూరిజం బ్లాక్ ప్రతిపాదించింది. విదేశీ రోగులకు ప్రత్యేక సేవలపై సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ అధ్యయనం చేసింది. వైద్య సేవలకు ప్యాకేజీ ధరల ఖరారుపై ఈ కమిటీ సిఫార్సాలు చేసింది. గౌరవ్ ఉప్పల్, గౌతమి, భీరప్ప సభ్యులతో ఈ కమిటీని నియమించింది. నెల రోజుల్లో ఈ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. తెలంగాణను మెడికల్, వెల్‌నెస్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దే దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి...
ఫాంహౌస్ కేడీతోనైనా, ఢిల్లీలో మోదీతోనైనా కొట్లాడేందుకు సిద్ధం: సీఎం రేవంత్‌రెడ్డి
ఆ పనుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు.. మంత్రి సీతక్క వార్నింగ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News