Share News

హైదరాబాద్‌లోని స్టార్ హాస్పిటల్స్ డేటా లీక్.. పోలీసుల కేసు నమోదు

ABN , Publish Date - Aug 03 , 2026 | 09:36 AM

హైదరాబాద్‌లోని స్టార్ హాస్పిటల్స్ డేటా లీక్ ఘటనపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో కేసు నమోదైంది. ఆస్పత్రి సీఈవో రాహుల్ మెడక్కర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

హైదరాబాద్‌లోని స్టార్ హాస్పిటల్స్ డేటా లీక్.. పోలీసుల కేసు నమోదు
Hyderabad, Star Hospitals Data Leak

హైదరాబాద్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని స్టార్ హాస్పిటల్స్ డేటా లీక్ (Hyderabad, Star Hospitals Data Leak) ఘటనపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో కేసు నమోదైంది. ఆస్పత్రి సీఈవో రాహుల్ మెడక్కర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రోగుల వ్యక్తిగత వివరాలు, వైద్య రికార్డులు లీక్ అయినట్లు ఫిర్యాదులో తెలిపారు. ఆస్పత్రి అంతర్గత గోప్య సమాచారాన్ని కూడా warehouse.diy అనే వెబ్‌సైట్‌లో ఉంచినట్లు చెప్పుకొచ్చారు. ఆ వెబ్‌సైట్‌లోకి ప్రవేశించే లాగిన్ క్రెడెన్షియల్స్ వాట్సాప్‌లో షేర్ చేసినట్లు వెల్లడించారు.


రోగులతో పాటు ఉద్యోగుల వ్యక్తిగత సమాచారం కూడా లీక్ అయినట్లు ఆరోపించారు. డేటా లీక్ కారణంగా గుర్తింపు చోరీ, ఆర్థిక మోసాలు, వేధింపులు జరిగే ప్రమాదం ఉందని ఆస్పత్రి వర్గాలు ఆందోళన చెందుతున్నారు. డేటా లీక్‌కు బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను హాస్పిటల్ సీఈవో కోరారు. ఆ వెబ్‌సైట్‌ను వెంటనే బ్లాక్ చేయాలని ఫిర్యాదులో విజ్ఞప్తి చేశారు. సర్వర్ లాగ్స్, మెటా డేటా వంటి డిజిటల్ ఆధారాలను భద్రపరచాలని ఆస్పత్రి సీఈవో రాహుల్ మెడక్కర్ విజ్ఞప్తి చేశారు.


వార్తలు కూడా చదవండి...

ఉజ్జయిని మహంకాళి బోనాలు.. దర్శించుకున్న కేంద్రమంత్రి బండి సంజయ్

ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని పూర్తి చేయడమే నా లక్ష్యం: మంత్రి కోమటిరెడ్డి

ఇంజినీర్లను క్రిమినల్ వేస్ట్ అనడమే కాంగ్రెస్ విధానమా?.. కేటీఆర్ ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 03 , 2026 | 11:16 AM