Share News

ఉజ్జయిని మహంకాళి బోనాలు.. ఆగస్టు 2 నుంచి 4 వరకు సికింద్రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

ABN , Publish Date - Jul 31 , 2026 | 05:28 PM

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందర్భంగా ఆగస్టు 2 నుంచి 4 వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు.

ఉజ్జయిని మహంకాళి బోనాలు.. ఆగస్టు 2 నుంచి 4 వరకు సికింద్రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
Hyderabad Bonalu 2026

హైదరాబాద్, జులై 31: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందర్భంగా ఆగస్టు 2 నుంచి 4 వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందర్భంగా మహంకాళి ఆలయం చుట్టూ రెండు కిలోమీటర్ల పరిధిలో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. పొగాకు బజార్, సుభాష్ రోడ్, హిల్ స్ట్రీట్ రహదారులను తాత్కాలికంగా మూసివేయనుండగా, జనరల్ బజార్ నుంచి మహంకాళి ఆలయం వైపు వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేయనున్నారు. ప్యాట్నీ, ప్యారడైజ్, రాణిగంజ్, ఘాస్‌మండి, బైబిల్ హౌస్, కర్బాలా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించనున్నారు.


14 పార్కింగ్ కేంద్రాలు..

భక్తుల సౌకర్యార్థం హరిహర కళాభవన్, మహబూబ్ కాలేజీ, సీఎంఆర్ మాల్, వెస్లీ కాలేజ్, జింఖానా గ్రౌండ్, స్వప్నలోక్‌తో పాటు మొత్తం 14 ప్రత్యేక పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్యాట్నీ నుంచి ట్యాంక్‌బండ్ వెళ్లే వాహనాలను ప్యారడైజ్, క్లాక్ టవర్ మీదుగా మళ్లించనుండగా, ప్యారడైజ్ నుంచి ఎంజీ రోడ్ వెళ్లే వాహనాలను సింధీ కాలనీ మీదుగా డైవర్ట్ చేయనున్నారు. అలాగే ఆర్టీసీ బస్సులకు కూడా ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ముందుగానే తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకుని, ట్రాఫిక్ పోలీసుల సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని అధికారులు సూచించారు.


వార్తలు కూడా చదవండి...

2034 వరకూ నేనే ముఖ్యమంత్రిగా ఉంటా: సీఎం రేవంత్‌రెడ్డి

నీట్ యూజీ కౌన్సెలింగ్ ప్రక్రియలో కేంద్రం విప్లవాత్మక సంస్కరణలు

నీట్ పేపర్ లీక్ నిరసన.. పెల్లెట్ గన్స్ వాడకంపై సుప్రీంకోర్టు సీరియస్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jul 31 , 2026 | 05:48 PM