హైదరాబాద్‌లో నీళ్ల బకెట్‌లో పడి చిన్నారి మృతి
ABN , Publish Date - Oct 23 , 2026 | 01:35 PM
హైదరాబాద్ కుత్బుల్లాపూర్ సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని పాండు బస్తీలో విషాదం చోటుచేసుకుంది. ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీళ్లు నిండిన బకెట్‌లో పడి ఏడాదిన్నర చిన్నారి రాణి దేవి మృతిచెందింది.
హైదరాబాద్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ కుత్బుల్లాపూర్ సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని పాండు బస్తీలో విషాదం చోటుచేసుకుంది. ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ నీళ్లు నిండిన బకెట్‌లో పడి ఏడాదిన్నర చిన్నారి రాణిదేవి మృతిచెందింది. బిహార్‌కు చెందిన పప్పు రవిదాస్ (45) కూలీ పనులు చేస్తూ పాండు బస్తీలో నివసిస్తున్నాడు. చిన్నారి తల్లి బిహార్‌లో ఉండటంతో, తండ్రి వద్దే ఉంటున్న చిన్నారిని మరో కుమార్తె చాందిని కుమారి (10) చూసుకుంటోంది.
నిన్న (గురువారం) ఉదయం కుటుంబ సభ్యులు కూలీ పనులకు వెళ్లారు. సాయంత్రం సుమారు 4 గంటలకు తన అక్క చాందిని వాష్‌రూమ్‌కు వెళ్లి బయటకు వచ్చి, బకెట్‌లో పడిన తన చెల్లిని చూసి కేకలు వేసింది. ఈ క్రమంలో చిన్నారిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సూరారం పోలీసులు బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ - 194 కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మా ప్రభుత్వంలో ముదిరాజ్‌లను భాగస్వాములను చేసే బాధ్యత నాది: సీఎం రేవంత్‌రెడ్డి
టీడీఆర్ సేవలకు ఆధార్‌తో గుర్తింపు నిర్ధారణకు ప్రభుత్వం అనుమతి
ఏపీలో పెట్టుబడులే కాదు.. ఉత్పత్తి కూడా ప్రారంభించాలి: సీఎం చంద్రబాబు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News