Mahesh Kumar Goud: సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితిపై టీపీసీసీ చీఫ్ ఆరా
ABN , Publish Date - Jan 06 , 2026 | 12:57 PM
సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితిపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరా తీశారు. ఏఐసీసీ పెద్దలకు ఫోన్ చేసి సోనియా గాంధీ ఆరోగ్యపరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. సోనియా ఆరోగ్యం నిలకడగా ఉందని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
ఢిల్లీ , జనవరి 6 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్లమెంటరీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ (Sonia Gandhi) ఇవాళ (మంగళవారం) అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పించారు. సోనియాగాంధీ తీవ్రమైన దగ్గుతో బాధపడుతోండటంతో ఆమెను వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితిపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఆరా తీశారు. ఏఐసీసీ పెద్దలకు ఫోన్ చేసి సోనియా గాంధీ ఆరోగ్యపరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. సోనియా ఆరోగ్యం నిలకడగా ఉందని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
అనారోగ్యానికి కారణం కాలుష్యమేనా..
కాగా, ఆస్పత్రి వర్గాల సమాచారం ప్రకారం.. సోనియా గాంధీకి సీనియర్ పల్మనాలజిస్ట్ పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో నెలకొన్న తీవ్ర వాయు కాలుష్యం కారణంగానే సోనియా గాంధీకి ఈ అనారోగ్య పరిస్థితి ఏర్పడినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కాలుష్య స్థాయిలు పెరగడంతో శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని వైద్యులు సూచించారు.
వైద్యుల పర్యవేక్షణలో చికిత్స..
వైద్యుల సూచనల మేరకు సోనియాగాంధీకి అవసరమైన పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరిస్థితిని నిశితంగా వైద్యులు గమనిస్తున్నట్లు సమాచారం. కాగా గతంలోనూ సోనియాగాంధీ పలు ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి...
ఆ అక్రమ నిర్మాణాలను తొలగించాలి.. సీఎం రేవంత్‌కి కిషన్‌రెడ్డి లేఖ
విద్యార్థులకు అలర్ట్.. సంక్రాంతి సెలవులపై క్లారిటీ..
Read Latest Telangana News And Telugu News