Share News

శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ 2గంటలు ఆలస్యం

ABN , Publish Date - Mar 28 , 2026 | 07:08 AM

హైదరాబాద్‌ నుంచి పుణె వెళ్లాల్సిన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైలు రెండుగంటలు ఆలస్యంగా బయల్దేరింది.

శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ 2గంటలు ఆలస్యం

  • అకస్మాత్తుగా రీషెడ్యూల్‌

హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌ నుంచి పుణె వెళ్లాల్సిన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైలు రెండుగంటలు ఆలస్యంగా బయల్దేరింది. శుక్రవారం మధ్యాహ్నం 2.40గంటలకు నాంపల్లి నుంచి బయల్దేరాల్సిన శతాబ్ది(12026)ఎక్స్‌ప్రెస్‏కు సంబంధించి, పుణె నుంచి రావాల్సిన పెయిరింగ్‌ ట్రైన్‌(12025) రెండు గంటలు ఆలస్యంగా రావడంతో అధికారులు రీషెడ్యూల్‌ చేశారు. శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌(Shatabdi Express) ఆకస్మాత్తుగా రీషెడ్యూల్‌ కావడంతో అప్పటికే స్టేషన్‌కు చేరుకున్న ప్రయాణికులతో పాటు బంధువులు అక్కడే వేచి ఉండి ఇబ్బందులు పడాల్సి వచ్చింది.


city1.2.jpg

ఈ వార్తలు కూడా చదవండి:

మార్కెట్‌కు చమురు మంట

త్వరలో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 28 , 2026 | 07:16 AM