ఈ రాశి వారికి గుడ్ న్యూస్ ఉద్యోగంలో శుభవార్త ఖాయం
ABN , Publish Date - Mar 06 , 2026 | 02:04 AM
నేడు రాశిఫలాలు 6-03-2026 శుక్రవారం, శ్రీవారు, శ్రీమతికి సంబంధించిన విషయాల్లో శుభపరిణామాలు సంభవం...
నేడు రాశిఫలాలు 6-03-2026 శుక్రవారం, శ్రీవారు, శ్రీమతికి సంబంధించిన విషయాల్లో శుభపరిణామాలు సంభవం.

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
శ్రీవారు, శ్రీమతికి సంబంధించిన విషయాల్లో శుభపరిణామాలు సంభవం. వేడుకల్లో పెద్దలను కలుసుకుంటారు. సమావేశాల్లో కీలక పాత్ర పోషిస్తారు. సన్నిహితుల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ శుభప్రదం.

వృషభం ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. దుర్గామాతను ఆరాధించండి.

మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
చిన్నారుల వైఖరి ఆనందం కలిగిస్తుంది. సృజనాత్మకంగా వ్యవహరించి ఉద్యోగ వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. క్రీడలు, విద్య, ఆడిటింగ్, టెలివిజన్, ప్రకటనల రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. కనకధారా స్తోత్ర పారాయణ శుభప్రదం.

కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వేడుకలకు ఏర్పాట్లు చేసుకుంటారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు లాభిస్తాయి. కుటుంబ వ్యవహారాలు ఉల్లాసం కలిగిస్తాయి. అమ్మవారి ఆలయాన్ని దర్శించండి.

సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
విలువైన పత్రాలు అందుకుంటారు. ఆర్థికపరమైన చర్చలు సమావేశాలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సన్నిహితుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉదయం లలితా దేవి స్తోత్ర పారాయణ శుభప్రదం.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పందాలు పోటీల్లో విజయం సాధిస్తారు. దుర్గాష్టక పారాయణ శుభప్రదం.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
కొత్త ప్రాజెక్టులు చేపట్టి విజయం సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. సహోద్యోగుల సహకారం లోపిస్తుంది. విందు వినోదాలు ఉల్లాసం కలిగిస్తాయి. వ్యసాయం, పరిశ్రమల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
సినిమాలు, రాజకీయాలు, టెలివిజన్, ఎగుమతుల రంగాలకు చెందిన వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు లాభిస్తాయి. విదేశీ చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉదయం శ్రీ దుర్గామాతను ఆరాధించండి.

ధనుస్పు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక వ్యవహారాలు పూర్తి చేయగలుగుతారు. పెట్టుబడులు లాభిస్తాయి. ఇంట్లో వేడుకలు, శుభకార్యాలకు ఏర్పాట్లు చేస్తారు. ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. కనకధారా స్తోత్ర పారాయణ శుభప్రదం.

మకరం (డిసెంబరు 22 - జనవరి 20 మధ్య జన్మించిన వారు)
పెద్దలతో చర్చలు, ప్రయాణాలు లాభిస్తాయి. ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి కీలక సమాచారం అందుకుంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. శ్రీ గాయత్రీ మాత ఆరాధన శుభప్రదం.

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
ఉన్నత చదువులు విదేశీ ప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. న్యాయ, బోధన, ప్రచురణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ పారాయణ శుభప్రదం.

మీనం (ఫిబ్రవరి 20- మార్చి 20 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. బీమా, పన్నులు, పెన్షన్ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. మరమ్మతులు, హార్డ్‌వేర్ రంగాల వారికి ప్రోత్సాహకరమైన రోజు. దుర్గామాతను ఆరాధించండి.
బిజుమళ్ళ బిందుమాధవ శర్మ