Share News

పెట్టుబడులతో ఏపీకి రండి

ABN , Publish Date - Mar 28 , 2026 | 05:57 AM

పెట్టుబడులతో ఏపీకి రావాలని అమెరికాలోని ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ నిపుణులను ఆంధ్రప్రదేశ్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ (ఏపీటీఎస్‌) చైర్మన్‌ మన్నవ మోహనకృష్ణ ఆహ్వానించారు.

పెట్టుబడులతో ఏపీకి రండి

  • అమెరికా పారిశ్రామికవేత్తలకు మన్నవ పిలుపు

అమరావతి, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): పెట్టుబడులతో ఏపీకి రావాలని అమెరికాలోని ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ నిపుణులను ఆంధ్రప్రదేశ్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ (ఏపీటీఎస్‌) చైర్మన్‌ మన్నవ మోహనకృష్ణ ఆహ్వానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ నాయకత్వంలో రాష్ట్రంలో ఐటీ విప్లవం వెల్లువెత్తుతోందని అమెరికా న్యూజెర్సీ పర్యటనలోఉన్న మన్నవ వెల్లడించారు. రాష్ట్రంలో గూగుల్‌ భాగస్వామ్యం, క్వాంటం వ్యాలీ ప్రాజెక్టులతో పెట్టుబడులకు అద్భుత అవకాశాలున్నాయని వివరించారు. పెట్టుబడులకు ప్రభుత్వం సంపూర్ణసహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. పలువురు ఐటీ సంస్థల ప్రతినిధులతో ముఖాముఖి చర్చలు జరిపిన మన్నవ ..రాష్ట్రానికి పెట్టుబడులతో వస్తే సంపూర్ణ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.

Updated Date - Mar 28 , 2026 | 05:58 AM