Share News

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కలకలం.. రూ.2 కోట్ల హైడ్రోపోనిక్ గంజాయి పట్టివేత

ABN , Publish Date - Oct 13 , 2026 | 05:58 PM

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీ మొత్తంలో హైడ్రోపోనిక్ గంజాయి లభ్యమవడం కలకలం రేపింది. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడి దగ్గర దాదాపు రూ.2కోట్ల విలువ చేసే గంజాయి లభించింది.

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కలకలం.. రూ.2 కోట్ల హైడ్రోపోనిక్ గంజాయి పట్టివేత
hydroponic cannabis seizure found at shamshabad airport

హైదరాబాద్, అక్టోబర్ 13: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నిషేధిత హైడ్రోపోనిక్ గంజాయిని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే..


బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడిని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో డీఆర్ఐ అధికారులు తనిఖీ చేయగా.. రూ. 2 కోట్ల విలువ చేసే హైడ్రోపోనిక్ గంజాయి లభించడం కలకలం రేపింది. ప్రయాణికుడి ఎలక్ట్రిక్ గీజర్‌లో గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గీజర్‌లో దాచిన 73 హైగ్రేడ్ గంజాయి ప్యాకెట్లను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి నుంచి మొత్తంగా 7.750 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నార్కోటిక్ డ్రగ్ డిటెక్షన్ కిట్‌తో పరీక్షించి గంజాయి అని నిర్థారణ చేసుకున్న అనంతరం ప్రయాణికుడిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.


ఇవి కూడా చదవండి...

నేడు పార్టీలతో ఎస్‌ఈసీ భేటీ

శ్రీశైలంకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు.. తెలుగు రాష్ట్రాలకే గర్వకారణం: గొట్టిపాటి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 13 , 2026 | 06:07 PM