Share News

రేపటి నుంచి సికింద్రాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

ABN , Publish Date - Aug 01 , 2026 | 08:33 AM

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందర్భంగా సికింద్రాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఆగస్టు 2 నుంచి 4వ తేదీ తెల్లవారు జామున 3 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని జాయింట్‌ సీపీ జోయల్‌ డేవిస్‌ తెలిపారు.

రేపటి నుంచి సికింద్రాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు
Secunderabad traffic restrictions

హైదరాబాద్‌ సిటీ: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందర్భంగా సికింద్రాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఆగస్టు 2 నుంచి 4వ తేదీ తెల్లవారు జామున 3 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని జాయింట్‌ సీపీ జోయల్‌ డేవిస్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. అత్యవసర సహాయం కోసం ట్రాఫిక్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 9010203626కు కాల్‌ చేయవచ్చన్నారు.

పూర్తిగా మూసివేసే రహదారులు

  • పొగాకు బజార్‌ (టొబాకో బజార్‌), హమాలీ విగ్రహం నుంచి మహంకాళి ఆలయానికి వెళ్లే రహదారులు.

  • సుభాష్‌ రోడ్‌ (బాటా క్రాస్‌ రోడ్స్‌ నుంచి రోచా బజార్‌ వరకు).

  • హిల్‌స్ర్టీట్‌, ఆదయ్య క్రాస్‌ రోడ్స్‌ నుంచి మహంకాళి ఆలయానికి వెళ్లే రహదారి.

  • జనరల్‌ బజార్‌ నుంచి మహంకాళి ఆలయానికి వెళ్లే రహదారి.


ట్రాఫిక్‌ మళ్లింపు ఇలా..

  • ఎస్‌బీఐ క్రాస్‌ రోడ్స్‌, ప్యారడైజ్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వైపు వెళ్లే వాహనాలను ప్యాట్నీ వద్ద ప్యారడైజ్‌, మినిస్టర్‌ రోడ్‌ లేదా క్లాక్‌ టవర్‌, సంగీత్‌ క్రాస్‌ రోడ్స్‌, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌, చిలకలగూడ, ముషీరాబాద్‌ క్రాస్‌రోడ్స్‌, కవాడిగూడ, మారియాట్‌ హోటల్‌, ట్యాంక్‌బండ్‌ వైపు మళ్లిస్తారు.

  • ప్యారడైజ్‌ నుంచి బైబిల్‌ హౌస్‌ వైపు వెళ్లే వాహనాలను ప్యాట్నీ క్రాస్‌ రోడ్స్‌ వద్ద ఎస్‌బీఐ లేదా క్లాక్‌ టవర్‌ వైపు మళ్లిస్తారు.

  • క్లాక్‌ టవర్‌ నుంచి ఆర్‌.పి. రోడ్‌ వైపు వెళ్లే వాహనాలను ప్యాట్నీ వద్ద ఎస్‌బీఐ క్రాస్‌ రోడ్స్‌ లేదా ప్యారడైజ్‌, మినిస్టర్‌ రోడ్‌, రసూల్‌పురా, రాణిగంజ్‌, ట్యాంక్‌బండ్‌ వైపు మళ్లిస్తారు.


city3.jpg

  • బైబిల్‌ హౌస్‌ నుంచి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌, తిరుమలగిరి వైపు వెళ్లే వాహనాలను ఘాస్‌మండి వద్ద సజ్జన్‌లాల్‌ స్ర్టీట్‌, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ లేదా హిల్‌ స్ర్టీట్‌, రాణిగంజ్‌ వైపు మళ్లిస్తారు.

  • జబ్బార్‌ కాంప్లెక్స్‌, బన్సీలాల్‌పేట్‌ నుంచి వచ్చే వాహనాలను (భారీ వాహనాలతో సహా)- బైబిల్‌ హౌస్‌ క్రాస్‌ రోడ్స్‌ వద్ద కర్బలా, రాణిగంజ్‌ వైపు మళ్లిస్తారు.

  • చిల్డ్రన్స్‌ పార్క్‌, బైబిల్‌ హౌస్‌ నుంచి వచ్చే వాహనాలను కర్బలా క్రాస్‌ రోడ్స్‌ వద్ద రాణిగంజ్‌ క్రాస్‌ రోడ్స్‌ వైపు మళ్లిస్తారు.


  • కర్బలా మైదాన్‌ నుంచి సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు, సాధారణ వాహనాలు రాణిగంజ్‌ క్రాస్‌ రోడ్స్‌ వద్ద మినిస్టర్‌ రోడ్‌, రసూల్‌పురా క్రాస్‌ రోడ్స్‌(ఎడమ మలుపు), పీఎన్‌టీ ఫ్లైఓవర్‌, హెచ్‌.పి.ఎస్‌ యూ-టర్న్‌, సీటీఓ, ఎస్‌బీఐ క్రాస్‌రోడ్స్‌, వైఎంసీఏ, సెయింట్‌ జాన్స్‌ రోటరీ, సంగీత్‌, గోపాలపురం లేన్‌ మీదుగా రైల్వే స్టేషన్‌కు వెళ్లాలి.

  • రైల్వే స్టేషన్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వైపు తిరిగి వెళ్లే ఆర్టీసీ బస్సులు-చిలకలగూడ క్రాస్‌రోడ్స్‌, గాంధీ ఆస్పత్రి, ముషీరాబాద్‌ క్రాస్‌రోడ్స్‌, కవాడిగూడ, మారియాట్‌ హోటల్‌, ట్యాంక్‌బండ్‌ మీదుగా వెళ్లాలి.


city3.2.jpg

  • రైల్వేస్టేషన్‌ నుంచి తాడ్‌బంద్‌, బేగంపేట్‌ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు-- క్లాక్‌ టవర్‌, ప్యాట్నీ క్రాస్‌ రోడ్స్‌/వైఎంసీఏ, ఎస్‌బీఐ క్రాస్‌రోడ్స్‌ మీదుగా వెళ్లాలి.

  • సీటీఓ జంక్షన్‌ నుంచి ఎమ్‌.జి. రోడ్‌ వైపు వెళ్లే వాహనాలు-- ప్యారడైజ్‌ వద్ద సింధీ కాలనీ(కుడి మలుపు), మినిస్టర్‌ రోడ్‌ (ఎడమ మలుపు) రాణీగంజ్‌ క్రాస్‌ రోడ్స్‌(కుడి మలుపు) కర్బలా మైదాన్‌ వైపు మళ్లిస్తారు.

  • ప్యాట్నీ క్రాస్‌ రోడ్స్‌ నుంచి వచ్చే వాహనాలను ప్యారడైజ్‌ వద్ద సీటీఓ జంక్షన్‌ వైపు మళ్లిస్తారు.


పార్కింగ్‌ స్థలాలు

హరిహర కళాభవన్‌, యశోద పార్కింగ్‌, మహబూబ్‌ కాలేజీ, సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌, ఓల్డ్‌ జైలుఖానా ఖాళీ స్థలం, ఇస్లామియా హైస్కూల్‌, ఆదయ్య మెమోరియల్‌ హైస్కూల్‌, జీహెచ్‌ఎంసీ గ్రౌండ్‌ నల్లగుట్ట.

వీఐపీ వాహనాలు

ఎంజీ రోడ్‌ మహాత్మాగాంధీ విగ్రహం, పార్శీ టెంపుల్‌, వెస్లీ కాలేజీ, జీహెచ్‌ఎంసీ గ్రౌండ్‌ చుట్టల బస్తీ, జింఖానా గ్రౌండ్‌, స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌, తాజ్‌ త్రీస్టార్‌ లేన్‌.


ఈ వార్తలు కూడా చదవండి:

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 01 , 2026 | 08:33 AM