రాష్ట్రంలో ‘సర్’ గడువు పెంపు
ABN , Publish Date - Aug 01 , 2026 | 08:08 AM
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) గడువును ఆగస్టు 10 వరకు పొడిగించింది. ఈ ప్రక్రియ కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం ఎన్యుమరేషన్ ఫారా ల్లో వివరాల నమోదు..
ఆగస్టు 10 వరకు ఫారాలు సమర్పించొచ్చు
ఎన్నికల సంఘం ప్రకటన
77.12 శాతం ఎన్యుమరేషన్ పూర్తి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) గడువును ఆగస్టు 10 వరకు పొడిగించింది. ఈ ప్రక్రియ కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం ఎన్యుమరేషన్ ఫారా ల్లో వివరాల నమోదు, డిజిటలైజేషన్ ప్రక్రియ ఆగస్టు 3 వరకు పూర్తికావడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఈసీఐ శుక్రవారం ప్రకటించింది. ఇదిలా ఉండగా.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 77.12ు ఎన్యుమరేషన్ పూర్తయిందని ఈసీఐ తెలిపింది. హైదరాబాద్ జిల్లాలో 56.31, రంగారెడ్డిలో 63.43, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 61.37 శాతం పూర్తయినట్లు పేర్కొంది. ఈసీఐ సవరించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 10 వరకు ఎన్యుమరేషన్ ఫారాలను సమర్పించాల్సి ఉంటుంది. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, పునర్వ్యవస్థీకరణ కూడా ఈనెల 10వరకు పూర్తిచేయాలి. ఈనెల 17 వరకు ముసాయిదా ఓటరు జాబితాల ప్రచురణ, క్లెయిమ్‌లు అభ్యంతరాల స్వీకరణను ఈ నెల 17 నుంచి సెప్టెంబరు వరకు చేపటాలని నిర్ణయించారు.