Share News

హైదరాబాద్‏లోని ఈ ఏరియాల్లో 10గంటల నుంచి కరెంట్ కట్..

ABN , Publish Date - Aug 01 , 2026 | 07:28 AM

హైదరాబాద్ ఆజామాబాద్‌ డివిజన్‌ పరిధిలో విద్యుత్‌ ఫీడర్ల మరమ్మతు పనుల నిమిత్తం శనివారం విద్యుత్‌ సరఫరా ఉండదని సీబీడీ ఏడీఈ జి. నాగేశ్వరరావు తెలిపారు.

హైదరాబాద్‏లోని ఈ ఏరియాల్లో 10గంటల నుంచి కరెంట్ కట్..
Hyderabad power cut today

హైదరాబాద్: హైదరాబాద్ ఆజామాబాద్‌ డివిజన్‌ పరిధిలో విద్యుత్‌ ఫీడర్ల మరమ్మతు పనుల నిమిత్తం శనివారం విద్యుత్‌ సరఫరా ఉండదని సీబీడీ ఏడీఈ జి. నాగేశ్వరరావు తెలిపారు. అయ్యప్ప టెంపుల్‌, ఇందిరానగర్‌ 11కేవీ విద్యుత్‌ ఫీడర్ల పరిధిలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటలవరకు, దయారా మార్కెట్‌ పరిధిలో 11 నుంచి 12 గంటల వరకు, సాయిబాబా టెంపుల్‌ పరిధిలో మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు, పార్శిగుట్ట పరిధిలో మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 4 గంటలవరకు విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తామన్నారు.


city1.2.jpgరామంతాపూర్‌: రామంతాపూర్‌ పాలిటెక్నిక్‌ ఇండోర్‌ సబ్‌ స్టేషన్‌ పరిధిలోని పీఎస్‌ కాలనీ ఫీడర్‌ నందలి మధురా నగర్‌ రోడ్డు నంబర్‌ 1 నుంచి 4, శ్రీనివాసపురం 1 నుంచి 4, పాశం సత్తయ్య కాలనీ ప్రాంతాలలో శనివారం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 3 గంటల వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం నెలకుంటుందని సంబంధిత ట్రాన్స్‌కో ఏఈ కూతడి లావణ్య ఒక తెలిపారు.


పేట్‌బషీరాబాద్‌: పేట్‌బషీరాబాద్‌ సబ్‌ స్టేషన్‌ పరిధిలో విద్యుత్‌ మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్‌ ఉండదని ఏఈ జ్ఞానేశ్వర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జీడిమెట్ల ఫీడర్‌ పరిధిలో ఉదయం 10.30 నుంచి 11గంటల వరకు జీడిమెట్ల గ్రామం, భీమా ఫ్రైడ్‌ అపార్టుమెంట్స్‌, పిస్తాహౌస్‌ ప్రాంతం, జీడిమెట్ల మెయిన్‌ రోడ్డు ప్రాంతంలో విద్యుత్‌ ఉండదని వినియోగదారులు గమనించి సహకరించాలని ఏఈ కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి:

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 01 , 2026 | 07:28 AM