తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న పీవీ సింధు..
ABN , Publish Date - Aug 01 , 2026 | 07:05 AM
భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఇవాళ (శనివారం) తెల్లవారుజామున తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. శ్రీవారి సుప్రభాత సేవలో భక్తిశ్రద్ధలతో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తిరుమల: భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఇవాళ (శనివారం) తెల్లవారుజామున తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. శ్రీవారి సుప్రభాత సేవలో భక్తిశ్రద్ధలతో సింధు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, క్రీడారంగంలో భారతదేశం మరిన్ని విజయాలు సాధించాలని తిరుమల వెంకన్నను ప్రార్థించారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించగా.. టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని ఆమెకు అందజేసి సత్కరించారు. సింధు పర్యటన సందర్భంగా ఆమెను చూసేందుకు భక్తులు ఆసక్తి చూపారు. పలువురు అభిమానులు సింధుతో ఫొటోలు దిగేందుకు ప్రయత్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి
శాస్ర్తీయంగా ఆర్థికాభివృద్ధి ప్రణాళిక
భోగాపురం ఎయిర్‌పోర్ట్ నేడే టేకాఫ్