శాస్ర్తీయంగా ఆర్థికాభివృద్ధి ప్రణాళిక
ABN , Publish Date - Aug 01 , 2026 | 02:28 AM
జిల్లా ఆర్థికాభివృద్ధి కార్యాచరణ ప్రణాళికను శాస్ర్తీయంగా రూపొందించాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య (గనులు) శాఖ ముఖ్య కార్యదర్శి, తిరుపతి ఎకనామిక్ రీజన్ సీఈవో ముఖేష్ కుమార్ మీనా అధికారులకు సూచించారు. శుక్రవారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో ముఖేష్ కుమార్ మీనా అధ్యక్షతన జేసీ శివనారాయణశర్మ ఆధ్వర్యంలో జిల్లా ఆర్థికాభివృద్ధి కార్యాచరణపై సమీక్ష నిర్వహించారు.
2047 విజన్‌కనుగుణంగా యాక్షన్ ప్లాన్ రూపొందించాలి
సీఈవో ముఖే్‌షకుమార్ మీనా
అన్నమయ్య, జులై 31(ఆంధ్రజ్యోతి): జిల్లా ఆర్థికాభివృద్ధి కార్యాచరణ ప్రణాళికను శాస్ర్తీయంగా రూపొందించాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య (గనులు) శాఖ ముఖ్య కార్యదర్శి, తిరుపతి ఎకనామిక్ రీజన్ సీఈవో ముఖేష్ కుమార్ మీనా అధికారులకు సూచించారు. శుక్రవారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో ముఖేష్ కుమార్ మీనా అధ్యక్షతన జేసీ శివనారాయణశర్మ ఆధ్వర్యంలో జిల్లా ఆర్థికాభివృద్ధి కార్యాచరణపై సమీక్ష నిర్వహించారు. సీఈవో మాట్లాడుతూ స్వర్ణ ఆంరఽధ-2047విజన్ అమలులో భాగంగా రాష్ట్రాన్ని విశాఖపట్నం, అమరావతి, తిరుపతి అనే మూడు ఆర్థిక ప్రాంతాలుగా ప్రభుత్వం విభజించిందన్నారు. తిరుపతిలో తొమ్మిది జిల్లాలు ఉన్నాయని, 2047 నాటికి ఈ ప్రాంతాన్ని 0.9 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని అన్నారు. అన్నమయ్య జిల్లా భౌగోళికంగా బెంగళూరు, తిరుపతి నగరాలకు దగ్గరలో ఉండటంతో అభివృద్ధి అవకాశాలు ఉన్నాయన్నారు. పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత రంగాలు, ఆహార ప్రాసెసింగ్, పర్యాటకం, పునరుత్పాదక ఇంధన రంగం విద్యా-నైపుణ్యాభివృద్ధి రంగాల్లో ఉన్న అవకాశాలను గుర్తించి వాటిని దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికల్లో చేర్చాలని సూచించారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన నీటి లభ్యత, విద్యుత్ సరఫరా, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. జేసీ శివనారాయణశర్మ జిల్లాలో నియోజకవర్గాల వారీగా అమలు చేస్తున్న ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలను, వనరులు, పెట్టుబడి అవకాశాలు, అభివృద్ధి సామర్థ్యాన్ని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి, సీపీవో వెంకట పెద్దయ్య, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.