Share News

చంద్రబాబు కాన్వాయ్‌పైకి దూసుకొచ్చిన కారు

ABN , Publish Date - Aug 01 , 2026 | 07:11 AM

ఏపీ సీఎం చంద్రబాబు కాన్వాయ్‌పైకి ఓ కారు దూసుకురావడంతో జరిగిన చిన్న ప్రమాదం తర్వాత చోటుచేసుకున్న ఘర్షణలో కాన్వాయ్‌ డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. హైదరాబాద్‌లోని పంజాగుట్టలో ఈ నెల 25న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

చంద్రబాబు కాన్వాయ్‌పైకి దూసుకొచ్చిన కారు
AP Cm Chandrababu Naidu

  • డ్రైవర్‌పై దాడి.. పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు

  • జూలై 25న ఘటన... ఆలస్యంగా వెలుగులోకి

పంజాగుట్ట, జూలై 31 (ఆంధ్రజ్యోతి): ఏపీ సీఎం చంద్రబాబు కాన్వాయ్‌పైకి ఓ కారు దూసుకురావడంతో జరిగిన చిన్న ప్రమాదం తర్వాత చోటుచేసుకున్న ఘర్షణలో కాన్వాయ్‌ డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. హైదరాబాద్‌లోని పంజాగుట్టలో ఈ నెల 25న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బేగంపేట విమానాశ్రయం నుంచి జూబ్లీహిల్స్‌ వైపు ఏపీ సీఎం.. మూడు కార్ల కాన్వాయ్‌తో వెళ్తుండగా, ఐటీసీ కాకతీయ హోటల్‌ సమీపంలో ఓ కారు అకస్మాత్తుగా దూసుకొచ్చి మూడో కారును స్వల్పంగా ఢీకొట్టింది. అనంతరం కారు డ్రైవర్‌, అతని తండ్రి వాహనం నుంచి దిగి కాన్వాయ్‌ డ్రైవర్‌ జోసె్‌ఫతో వాగ్వాదానికి దిగారు. దూషిస్తూ ముఖంపై దాడిచేశారు. బాధితుడు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడిలో తన 4పళ్లు విరిగాయని, సదరు కారు డ్రైవర్‌ తండ్రి తన కారును లాక్కొని బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 2 ప్రాంతంలో వదిలివెళ్లారని పేర్కొన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Aug 01 , 2026 | 07:53 AM