సికింద్రాబాద్ రైల్వే డివిజన్‌కు కొత్తగా రెండు సెక్షన్లు
ABN , Publish Date - Jun 04 , 2026 | 11:06 AM
దక్షిణ తీర రైల్వే (సౌత్ కోస్ట్ రైల్వే)లోని గుంతకల్ డివిజన్ నుంచి వాడి-రాయచూర్ సెక్షన్, గుంటూరు డివిజన్ నుంచి పగిడిపల్లి- విష్ణుపురం- జనపహాడ్ సెక్షన్ తాజాగా సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోకి వచ్చాయి.
రైళ్ల రాకపోకల పర్యవేక్షణకు
అదనపు కంట్రోల్ బోర్డుల ఏర్పాటు
హైదరాబాద్ సిటీ: దక్షిణ తీర రైల్వే (సౌత్ కోస్ట్ రైల్వే)లోని గుంతకల్ డివిజన్ నుంచి వాడి-రాయచూర్ సెక్షన్, గుంటూరు డివిజన్ నుంచి పగిడిపల్లి- విష్ణుపురం- జనపహాడ్ సెక్షన్ తాజాగా సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోకి వచ్చాయి. కొత్తగా చేరిన ఈ సెక్షన్‌లలో రైళ్ల రాకపోకలను సమర్థవంతంగా నిర్వహించడానికి సంచాలన్ భవన్‌లోని డివిజనల్ కంట్రోల్ ఆఫీ్‌సలో ప్రస్తుతం ఉన్న ఆరు కంట్రోల్ బోర్డులకు అదనంగా మరో రెండింటిని ఏర్పాటు చేశారు.
నూతనంగా ఏర్పాటు చేసిన సెక్షన్ కంట్రోల్ బోర్డులను దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ బుధవారం పరిశీలించారు. అనంతరం టెలికాం టెస్ట్ రూమ్‌ను కూడా తనిఖీ చేశారు. ఈ కంట్రోల్ రూమ్ లోకోమోటివ్‌లు, రైల్ ఇంజన్లకు అవసరమైన విద్యుత్ సరఫరా, ఓవర్‌హెడ్ పరికరాల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తుందని జీఎం చెప్పారు. జీఎం వెంట సికింద్రాబాద్ డీఆర్‌ఎం గోపాలకృష్ణన్, ఇతర అధికారులు ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎంతంటే..
లావాదేవీల్లో నగదు చెల్లింపులదే హవా
Read Latest AP News And Telangana News And International News And Telugu News