ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేటీఆర్ విచారణపై సజ్జనార్ ఏమన్నారంటే..
ABN , Publish Date - Jan 23 , 2026 | 08:24 PM
మాజీ మంత్రి కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు శుక్రవారం హాజరైన విషయం తెలిసిందే. ఈ విచారణ అనంతరం సిట్ చీఫ్ సజ్జనార్ స్పందించారు. ఆధారాలు, రికార్డులు ముందుంచి కేటీఆర్‌ను విచారణ జరిపామని స్పష్టం చేశారు.
హైదరాబాద్, జనవరి23(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు శుక్రవారం హాజరైన విషయం తెలిసిందే. ఈ విచారణ అనంతరం సిట్ చీఫ్ సజ్జనార్ (Sajjanar) స్పందించారు. ఆధారాలు, రికార్డులు ముందుంచి కేటీఆర్‌ను విచారణ జరిపామని స్పష్టం చేశారు. సాక్ష్యులను ప్రభావితం చేయొద్దని చెప్పామని తెలిపారు. అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని చెప్పామని ప్రస్తావించారు. కేటీఆర్‌ను ఒంటరిగానే విచారించామని సజ్జనార్ పేర్కొన్నారు.
తప్పుడు కథనాలతో సంబంధం లేదు..
ఫోన్ ట్యాపింగ్ కేవలం భద్రతా కారణాల దృష్ట్యా మాత్రమే జరిగిందని వివరించారు. ఇందులో ఎలాంటి చట్టవ్యతిరేకత లేదని కొన్ని మీడియా వర్గాలు, వ్యక్తులు నిరాధారమైన, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వెల్లడించారు. దర్యాప్తు సంస్థకు ఇలాంటి తప్పుడు కథనాలతో సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ దర్యాప్తు పూర్తిగా చట్టప్రకారం, నిష్పక్షపాతంగా, వృత్తిపరమైన ప్రమాణాలతో జరుగుతోందనిపేర్కొన్నారు. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, న్యాయమూర్తులు, ప్రముఖులతో సహా వేలాది మంది పౌరుల ఫోన్లను అనధికారికంగా, చట్టవిరుద్ధంగా ఇంటర్‌సెప్షన్ (ట్యాపింగ్), నిఘా పెట్టారనే ఆరోపణలపై తాము విచారణ చేస్తున్నామని సజ్జనార్ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం భారీ సాయం
బీఆర్ఎస్ నేతకు అసెంబ్లీ స్పీకర్ నోటీసులు
Read Latest Telangana News And Telugu News