ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ ధరలపై ప్రభుత్వం పునఃసమీక్ష
ABN , Publish Date - Oct 12 , 2026 | 10:17 AM
ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ ఛార్జీలపై పునఃపరిశీలన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కామన్ పాస్ ధరలు అధికంగా ఉన్నాయంటూ ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
హైదరాబాద్, అక్టోబర్ 12: ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ ఛార్జీలపై పునఃపరిశీలన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కామన్ పాస్ ధరలు అధికంగా ఉన్నాయంటూ ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఛార్జీలపై సమీక్ష జరిపేందుకు సర్కార్ నిర్ణయించినట్లు తెలిపారు. దీనిపై త్వరలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు.
ప్రస్తుతం రోజువారీ కామన్ పాస్ ధర రూ.400 కాగా.. నెలవారీ కామన్ పాస్ ధర రూ.8,500గా నిర్ణయించామని మంత్రి తెలిపారు. అయితే సామాన్యులకు అందుబాటులో ఉండేలా ఛార్జీలపై పునఃసమీక్ష చేయనున్నట్లు వెల్లడించారు. ప్రయాణికుల అభిప్రాయాలు, వాస్తవ పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రజలపై అదనపు ఛార్జీల భారం మోపడం ప్రభుత్వ లక్ష్యం కాదని స్పష్టం చేశారు. ఆర్టీసీ-మెట్రో సేవలను మరింత విస్తృతంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే కామన్ పాస్ ధరలపై తుది నిర్ణయం ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. షాకింగ్ సీన్స్
ఇండి కూటమి ర్యాలీ ఎఫెక్ట్.. ఢిల్లీలోని ఆరు మెట్రో స్టేషన్ల మూసివేత
Read Latest Telangana News And Telugu News