Share News

కన్న బిడ్డ హెల్త్ ఇన్సూరెన్స్‌నూ రద్దు చేశారు.. మస్క్‌పై మాజీ భార్య ఆరోపణ

ABN , Publish Date - Oct 12 , 2026 | 07:46 AM

కన్న బిడ్డ హెల్త్ ఇన్సురెన్స్‌నే మస్క్ రద్దు చేశారని ఆయన మాజీ భార్య, కెనడా రచయిత్రి జెన్నిఫర్ జస్టిన్ విల్సన్ తెలిపారు.

కన్న బిడ్డ హెల్త్ ఇన్సూరెన్స్‌నూ రద్దు చేశారు.. మస్క్‌పై మాజీ భార్య ఆరోపణ
Elon Musk

ఇంటర్నెట్ డెస్క్: కన్న బిడ్డ హెల్త్ ఇన్సురెన్స్‌నే మస్క్ రద్దు చేశారని ఆయన మాజీ భార్య, కెనడా రచయిత్రి జెన్నిఫర్ జస్టిన్ విల్సన్ తెలిపారు. తమ బిడ్డ వీవియన్ జెన్నా విల్సన్ ట్రాన్స్‌జెండర్‌గా మారిన మరుసటి రోజే మస్క్ ఆమె ఇన్సూరెన్స్‌ను క్యాన్సిల్ చేశారని తెలిపారు. త్వరలో విడుదల కానున్న ఓ డాక్యుమెంటరీ ‘మస్క్’లో ఈ వివరాలను పంచుకున్నారు. ఆస్కర్ అవార్డు గ్రహీత ఆలెక్స్ గిబ్నీ ఈ డాక్యుమెంటరీని డైరెక్ట్ చేశారు. అయితే, మస్క్ మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. తనను కావాలనే టార్గెట్ చేసేందుకు ఈ డాక్యుమెంటరీ రూపొందించినట్టు ఉందని చెప్పారు.

వీవియన్ ట్రాన్స్‌జెండర్‌గా మారిన రోజున మస్క్ ఆమెకు మద్దతు తెలిపారని అన్నారు. కానీ మరుసటి రోజే ఆమె ఇన్సూరెన్స్‌ను రద్దు చేశారని విల్సన్ ఆరోపించారు. అసలు వీవియన్ ట్రాన్స్‌జెండర్ అని తెలిశాక మస్క్ ఓ బిడ్డను కోల్పోయినట్టు ఫీలయ్యారని చెప్పారు. అయితే, వీవియన్ ఇష్టాన్ని గౌరవించాలని తాను చెప్పానని అన్నారు.


వీవియన్‌‌కు చిన్నతనం నుంచి స్వతంత్ర భావాలు ఉండేవని విల్సన్ అన్నారు. మస్క్ మాత్రం ఆమెను క్రమశిక్షణలో పెట్టేందుకు ప్రయత్నించేవారని తెలిపారు. తన మాట వినకపోతే జీవితంలో విఫల వ్యక్తిగా మిగిలిపోతావని మస్క్ ఆరేళ్ల వీవియన్‌ను హెచ్చరించినట్టు కూడా చెప్పారు. ఈ ప్రపంచంలో విజేతలు, పరాజితులు అనే రెండు రకాల మనుషులే ఉంటారని కూడా మస్క్ అప్పట్లో వీవియన్‌తో అన్నారని విల్సన్ గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం 22 ఏళ్ల వయసున్న వీవియన్ 2022లో తాను ట్రాన్స్‌జెండర్ అని బహిరంగంగా ప్రకటించారు. తన తండ్రి మస్క్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని కూడా కోర్టు డాక్యుమెంట్స్‌లో స్పష్టంగా తేల్చి చెప్పారు.

మస్క్ మాజీ భాగస్వామి ఆష్లీ సెయింట్ క్లేర్‌ కూడా ఈ డాక్యుమెంటరీలో పాల్గొన్నట్టు తెలిసింది. మస్క్ వివరాలు చెప్పకుండా ఉండేందుకు కోట్ల రూపాయల ఎన్‌డీఏ డీల్‌ను కాదనుకుని ఆమె డాక్యుమెంటరీలో పాల్గొన్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.


ఈ వార్తలనూ చదవండి:

ఫ్లైదుబాయ్ ఉదంతం.. నిందితుడికి విమాన సిబ్బంది సహాయం?

ఏఐ, అణ్వస్త్ర పోరు, జీవాయుధాలతో మహా ముప్పు

Updated Date - Oct 12 , 2026 | 07:59 AM