Share News

19 వరకు మద్యం షాపులకు దరఖాస్తులు

ABN , Publish Date - Oct 12 , 2026 | 05:28 AM

రెన్యువల్‌ కాకుండా, లాటరీ ద్వారా కేటాయించకుండా మిగిలిపోయిన 271 మద్యం షాపులకు ఎక్సైజ్‌ శాఖ రీనోటిఫికేషన్‌ జారీచేసింది. ఇందులో 267 సాధారణ షాపులు, నాలుగు కల్లుగీత కులాలకు రిజర్వ్‌డ్‌ షాపులు ఉన్నాయి.

19 వరకు మద్యం షాపులకు దరఖాస్తులు

  • 271 షాపులకు రీనోటిఫికేషన్‌.. 21న లాటరీ

అమరావతి, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): రెన్యువల్‌ కాకుండా, లాటరీ ద్వారా కేటాయించకుండా మిగిలిపోయిన 271 మద్యం షాపులకు ఎక్సైజ్‌ శాఖ రీనోటిఫికేషన్‌ జారీచేసింది. ఇందులో 267 సాధారణ షాపులు, నాలుగు కల్లుగీత కులాలకు రిజర్వ్‌డ్‌ షాపులు ఉన్నాయి. అర్హత కలిగిన వ్యక్తుల నుంచి ఈనెల 19 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ సీహెచ్‌ శ్రీధర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 21న లాటరీ ద్వారా షాపులు కేటాయిస్తామని పేర్కొన్నారు. అత్యధికంగా కడపలో 33, నెల్లూరు 24, గుంటూరు 19, తిరుపతి 19, పశ్చిమగోదావరి 17, ప్రకాశం 16, అనంతపురం 15, అనకాపల్లి 13, కృష్ణా 13, బాపట్ల 12, పల్నాడు 12, మార్కాపురం 11, శ్రీకాకుళంలో 10 షాపులు ఉన్నాయని వివరించారు. మిగిలిన జిల్లాల్లోనూ కొన్ని షాపులు ఉన్నాయని తెలిపారు. మొత్తం 3736 షాపులకు గాను 2929 రెన్యువల్‌ అయ్యాయని, 536 షాపులు లాటరీ ద్వారా కేటాయించామని వెల్లడించారు.

ఈ వార్తలనూ చదవండి...

నెల్లూరులో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు

రాయలసీమ అభివృద్ధి సభలో రాజకీయాలు వద్దు: పవన్ కల్యాణ్

Updated Date - Oct 12 , 2026 | 05:28 AM