Share News

ఇండి కూటమి ర్యాలీ ఎఫెక్ట్.. ఢిల్లీలోని ఆరు మెట్రో స్టేషన్ల మూసివేత

ABN , Publish Date - Oct 12 , 2026 | 08:05 AM

భద్రతా కారణాల దృష్ట్యా దేశ రాజధానిలోని రాజీవ్ చౌక్, జన్​‌పథ్, పటేల్ చౌక్, మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్, బరాఖంబా రోడ్ మెట్రో స్టేషన్లలో ఈరోజు (సోమవారం) ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సేవలు నిలిచిపోనున్నాయి.

ఇండి కూటమి ర్యాలీ ఎఫెక్ట్.. ఢిల్లీలోని ఆరు మెట్రో స్టేషన్ల మూసివేత

ఇంటర్నెట్ డెస్క్: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇండి కూటమి నేతలు సుప్రీం కోర్టు వరకూ ర్యాలీ చేపట్టిన నేపథ్యంలో ఢిల్లీలోని ఆరు మెట్రో స్టేషన్లు మూతపడనున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా దేశ రాజధానిలోని రాజీవ్ చౌక్, జన్​‌పథ్, పటేల్ చౌక్, మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్, బరాఖంబా రోడ్ మెట్రో స్టేషన్లలో ఈరోజు (సోమవారం) ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాలని సూచనలు జారీ చేసింది.


కాగా ‘చలో ఢిల్లీ - ప్రజాస్వామ్యం కోసం మార్చ్‌’ పేరిట సుప్రీం కోర్టు వరకూ ఇండి కూటమి నేతలు ర్యాలీగా తరలి వెళ్లనున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా, ‘సర్‌’ ప్రక్రియ నిలిపివేత కోరుతూ ఈ నేతలు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్‌కు వినతిపత్రం అందించనున్నారు. ఇందుకోసం తమకు ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో సమయమివ్వాలని సీజేఐను కాంగ్రెస్ నాయకులు కోరారు. అయితే ఈ విజ్ఞప్తిని సీజేఐ తిరస్కరించినట్టు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.


ఈ వార్తలూ చదవండి

సుప్రీంకు మార్చ్‌!

ఢిల్లీ ఆందోళనలో విద్యార్థులు, మహిళలపై దాడులు

Updated Date - Oct 12 , 2026 | 08:05 AM