ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం.. వ్యవసాయాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్
ABN , Publish Date - Nov 19 , 2026 | 06:03 PM
‘సాగు బాగుంటేనే సుభిక్షమైన తెలంగాణ సాధ్యం.. వ్యవసాయరంగ అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్బంగా ప్రభుత్వం అందించిన ఇందిరాగాంధీ కృషి రత్న పురస్కారాల ప్రదానోత్సవంలో సీఎం మాట్లాడారు.
హైదరాబాద్, నవంబర్ 19: ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం.. వ్యవసాయ రంగంలో కృషి చేసిన ఐదుగురు ప్రముఖులకు ఇందిరాగాంధీ కృషి రత్న పురస్కారాలను ప్రదానం చేసింది. వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ ఎం. సుగుణాకర్ రెడ్డి, డాక్టర్ ఎస్.డి. శిఖామణి, పాత్రికేయుడు దిలీప్ రెడ్డి, గిరిజన రైతు లోనావత్ శాంతాబాయి, సేంద్రీయ రైతు కె. లావణ్యలను ఈ అవార్డులు వరించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీరికి అవార్డులను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. సాగు బాగుంటేనే సుభిక్షమైన తెలంగాణ సాధ్యమవుతుందని సీఎం అన్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని.. దీని కోసం ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని తెలిపారు. సాగునీటి సౌకర్యాలతో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి.. రైతుల సంక్షేమం కోసం పాటుపడతామని సీఎం పేర్కొన్నారు.
అంతేకాకుండా.. ఇందిరాగాంధీ హయాంలో వ్యవసాయ రంగంలో జరిగిన అభివృద్ధి గురించి సీఎం వివరించారు. ఆమె హయాంలోనే వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్లు రూపుదిద్దుకున్నాయని సీఎం తెలిపారు. కాగా.. ఇందిరా హయాంలో జరిగిన వ్యవసాయాభివృద్ధిని వివరించే పుస్తకాన్ని ఆవిష్కరించారు. కాగా.. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
తెలంగాణ ఓటర్ల జాబితాపై ఈసీ కీలక నిర్ణయం
నీళ్ల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం: కేటీఆర్
ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కారుకు ప్రమాదం..
Read Latest Telangana News And AP NewsAnd National News
And Telugu News