Share News

అక్రమ నిర్మాణాలపై ఎవరినీ ఉపేక్షించం: రంగనాథ్‌

ABN , Publish Date - Aug 22 , 2026 | 04:34 PM

గచ్చిబౌలిలోని అంజయ్యనగర్‌లో ఏడంతస్తుల భవనం కుప్పకూలిది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన విషయం తెలియడంతో అక్కడకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ చేరుకున్నారు. ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు

అక్రమ నిర్మాణాలపై ఎవరినీ ఉపేక్షించం: రంగనాథ్‌
Ranganath

హైదరాబాద్, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): గచ్చిబౌలిలోని అంజయ్యనగర్‌లో ఏడంతస్తుల భవనం ఈరోజు (శనివారం) కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన విషయం తెలియడంతో అక్కడకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Ranganath) చేరుకుని ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అంజయ్యనగర్‌లోని అక్రమ నిర్మాణాలన్నీ తొలగిస్తామని స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాలపై ఎవరినీ ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఘటనాస్థలి పక్కన భవనాల వారు ఖాళీ చేసి వెళ్లాలని రంగనాథ్ ఆదేశించారు.


ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఇద్దరు మృతిచెందారని రంగనాథ్ తెలిపారు. బిల్డింగ్ యజమాని ఇంకా అందుబాటులోకి రాలేదని అన్నారు. ఈ బిల్డింగ్ నిర్మాణంపై సైబరాబాద్ మునిసిపల్ కమిషన‌ర్‌కి కొంతమంది ఫిర్యాదు చేశారని వెల్లడించారు. గతంలో హైడ్రాకు ఈ బిల్డింగ్ నిర్మాణంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. ఏడు అంతస్తులు, ఒక పెంట్ హౌస్ మొత్తం ఎనిమిది అంతస్తుల బిల్డింగ్‌ను నిర్మిస్తున్నారని వివరించారు.


నాలాను అతిక్రమించి ఈ బిల్డింగ్ నిర్మాణం జరుగుతోందని రంగనాథ్ అన్నారు. చుట్టుపక్కల ఉన్న భవనాలను పరిశీలించి త్వరలోనే కూల్చివేస్తామని తెలిపారు. నిర్వాహకుడు షాజిద్ హాస్టల్ బిల్డింగులను నిర్మించి.... రెంట్‌కు ఇస్తుంటాడని చెప్పారు. హైడ్రా ఈ ఘటన సహాయక చర్యల్లో పాల్గొంటుందని.... ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. శిథిలాల కింద అదృష్టవశాత్తూ ఇంకెవరూ ఉండకపోవచ్చని భావిస్తున్నామని రంగనాథ్ పేర్కొన్నారు.


నాలుగు నెలల క్రితమే ఈ నిర్మాణాలను సీజ్ చేశాం: సృజన

అలాగే, ఈ ఘటన గురించి సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన మాట్లాడారు. గతంలోనే ఈ నిర్మాణాలపై తమకు ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. నాలుగు నెలల క్రితమే ఈ నిర్మాణ పనులను ఆపేసి, సీజ్ చేశామని వెల్లడించారు. మళ్లీ నిన్న వర్క్ మొదలుపెట్టారని చెప్పారు. ఈరోజు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యామని అన్నారు. ఈ లోపు ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పారు. ఈ నాలాను ఆక్రమించి నిర్మాణలు చేస్తున్నారన్నారు. ఈ బిల్డింగ్ చుట్టూ చాలా అక్రమ నిర్మాణాలు ఉన్నాయని అన్నారు. హాస్టల్ బిల్డింగ్ కోసం ఈ నిర్మాణాన్ని చేపట్టారని సృజన తెలిపారు.


వార్తలు కూడా చదవండి...

హరీశ్‌రావు కాదు.. అబద్దాల రావు.. మంత్రి పొంగులేటి సెటైర్లు

ఆ భూములను లాక్కుంటే.. చూస్తూ ఊరుకోం.. రేవంత్‌ సర్కార్‌కు కవిత వార్నింగ్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 22 , 2026 | 05:07 PM